కోల్‌ ఇండియా రూ.16,500 కోట్ల పెట్టుబడులు

Feb 21,2024 21:05 #Business

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బగ్గు ఉత్పత్తిదారు కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సిఐఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.16,500 కోట్ల పైగా పెట్టుబడుల వ్యయం చేయనుందని బగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత బగ్గు ఉత్పత్తిలో కోల్‌ ఇండియా 80 శాతం వాటా కలిగి ఉంది. ”2023-24కు గాను సిఐఎల్‌, ఎన్‌ఎల్‌సిఐఎల్‌ సంస్థలు మరోమారు తమ పెట్టుబడుల లక్ష్యం కంటే ఎక్కువగా వ్యయం చేస్తున్నాయి. రెండు సంస్థలు కూడా భారత వృద్థిలో కీలక భాగస్వామ్యం అవుతున్నాయి.” అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఎన్‌ఎల్‌సి ఇండియా రూ.2,880 కోట్ల పెట్టుబడుల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కాగా మంత్రిత్వ శాఖ రూ.21,030 కోట్ల పెట్టుబడుల లక్ష్యాన్ని పెట్టుకుంది. గడిచిన కొన్ని ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ బగ్గు సంస్థలు అంచనాలు మించి పెట్టుబడులు చేస్తున్నాయి. 2021-22లో కోల్‌ ఇండియా, ఎన్‌ఎల్‌సిఐఎల్‌లు వరుసగా 104.88 శాతం, 123.33 శాతం చొప్పున పెట్టుబడుల లక్ష్యాన్ని చేరాయి. 2022-23లో ఇరు సంస్థలు 113 శాతం లక్ష్యాన్ని నమోదు చేశాయి.

➡️