టాటా టెక్‌ ఇష్యూకు అనుహ్యా స్పందన

Nov 24,2023 21:10 #Business

రూ.3వేల కోట్ల ఐపిఒకు రూ.1.5 లక్షల కోట్ల బిడ్లు

ముంబయి : టాటా గ్రూపు నుంచి దాదాపుగా 19 ఏళ్ల తర్వాత తొలిసారి ఇష్యూకు వచ్చిన టాటా టెక్నాలజీస్‌ ఇష్యూకు అనుహ్యా స్పందన వచ్చింది. ఈ ఇష్యూలో ద్వారా రూ.3042.5 కోట్లు సమీకరించాలని ఆ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా రూ.1.5 లక్షల కోట్ల విలువ చేసే బిడ్డింగ్‌లు రావడం విశేషం. ఇందులో ఇన్స్‌ట్యూషనల్‌ ఇన్వెస్టర్స్‌ ఏకంగా రూ.1.07 లక్షల కోట్లకు బిడ్డింగ్‌ చేశారు. మూడు రోజుల పాటు సాగిన ఇష్యూ శుక్రవారంతో ముగిసింది. టాటా మోటార్స్‌కు చెందిన టాటా టెక్నాలజీస్‌ ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ డిజిటల్‌ సర్వీసెస్‌ సంస్థ, జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ సహా టాటా గ్రూప్‌లోని పలు సంస్థలకు ఇది ప్రధానంగా సేవలందిస్తోంది. ఈ ఐపిఒలో భాగంగా టాటా మోటార్స్‌ 11.4 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించనుంది.

➡️