డిమ్యాట్‌, ఎంఎఫ్‌ నామినీ డిక్లరేషన్‌కు గడువు పెంపు

Dec 28,2023 21:30 #Business

న్యూఢిల్లీ : డిమ్యాట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ ఖాతాదారులు తమ నామినీల పేర్లు నమోదు చేయడానికి పెట్టుబడుల రెగ్యూలేటరీ సంస్థ సెబీ మరింత గడువు ఇచ్చింది. ఈ గడువును 2024 జూన్‌ 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇది వరకు ఇచ్చిన అవకాశం డిసెంబర్‌ 31తో ముగియనుంది. అనుహ్యా పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు ఇన్వెస్టర్ల పెట్టుబడులకు భద్రత కల్పించేందుకు.. వారసులకు సొమ్ము అప్పగించేందుకు నామినీ డిక్లరేషన్‌ సమర్పించాలని సెబీ సూచించింది.

➡️