పిపిఎస్‌ మోటార్స్‌తో స్కానియా ఇండియా జట్టు

Dec 6,2023 21:30 #Business

హైదరాబాద్‌ : పిపిఎస్‌ మోటర్స్‌తో ప్రత్యేక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు స్కానియా కమర్షియల్‌ వెహికల్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌ బుధవారం ప్రకటించింది. దీంతో దేశంలోని స్కానియా మైనింగ్‌ టిప్పర్‌లకు ఏకైక ప్రతినిధిగా వ్యవహారించనున్నట్లు తెలిపింది. ఈ భాగస్వామ్యం ద్వారా తాము మోటార్స్‌ అమ్మకాలు, సేవా కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దేశంలో పిపిఎస్‌ నెట్‌వర్క్‌ విస్తరణ, అధునాతన కస్టమర్‌ మద్దతును అందించనున్నామని స్కానియా కమర్షియల్‌ వెహికల్స్‌ ఇండియా ఎండి జోహన్‌ పి ష్లిటర్‌ తెలిపారు. భారత్‌లో మైనింగ్‌ ట్రక్కుల వ్యాపారం కోసం స్కానియాతో తాము ప్రత్యేక పంపిణీదారుగా భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఉందని పిపిఎస్‌ మోటర్స్‌ ఎండి రాజీవ్‌ సంఘ్వీ పేర్కొన్నారు.

➡️