శాంసంగ్‌ నుంచి మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ ఫోన్‌

Feb 6,2024 10:25 #Business

గెలాక్సీ ఎక్స్‌ కవర్‌ 7.. ఇవీ స్పెషిఫికేషన్స్‌..!

ముంబయి: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్‌ మేజర్‌ శాంసంగ్‌ తన శాంసంగ్‌ గెలాక్సీ ఎక్స్‌ కవర్‌7 ఫోన్‌ను మంగళవారం భారత్‌ మార్కెట్లో ఆవిష్కరించింది. రిమూవబుల్‌ బ్యాటరీ ఫెసిలిటీ గల శాంసంగ్‌ గెలాక్సీ ఎక్స్‌ కవర్‌ 7 రగ్డ్‌ ఫోన్‌ను గత నెలలోనే గ్లోబల్‌ మార్కెట్లలో ఆవిష్కరించింది. భారత్‌ మార్కెట్లో స్టాండర్డ్‌ ఎడిషన్‌, ఎంటర్‌ప్రైజ్‌ ఎడిషన్‌లలో లభిస్తుంది. 4050 ఎంఏహెచ్‌ కెపాసిటీ గల బ్యాటరీతోపాటు సింగిల్‌ 50-మెగా పిక్సెల్‌ రేర్‌ కెమెరా ఉంటుంది. భారత్‌ మార్కెట్లోనే తాము విడుదల చేసిన ఫస్ట్‌ ఎవర్‌ ఎంటర్‌ ప్రైజ్‌ ఫోకస్డ్‌ స్మార్ట్‌ ఫోన్‌ గెలాక్సీ ఎక్స్‌ కవర్‌7 అని శాంసంగ్‌ తెలిపింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎక్స్‌ కవర్‌ 7 ఫోన్‌ స్టాండర్డ్‌ ఎడిషన్‌ ధర రూ.27,208, ఎంటర్‌ప్రైజ్‌ ఎడిషన్‌ ధర రూ.27,530 పలుకుతుంది. 6జీబీ ర్యామ్‌ విత్‌ 128 జీబీ స్టోరేజీ వర్షన్‌ తో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. స్టాండర్డ్‌ ఎడిషన్‌ ఒక ఏడాది, ఎంటర్‌ ప్రైజ్‌ ఎడిషన్‌ ఫోన్‌కు రెండేండ్ల వారంటీ ఉంటుంది. శాంసంగ్‌ వెబ్‌ సైట్‌, ఆన్‌ లైన్‌ ఈపీపీ పోర్టల్‌ ద్వారా కార్పొరేట్‌, సంస్థాగత కస్టమర్లు కొనుగోలు చేయొచ్చు. గెలాక్సీ ఎక్స్‌ కవర్‌ 7 ఎంటర్‌ ప్రైజ్‌ ఎడిషన్‌ 12 నెలల నాక్స్‌ సూట్‌ సబ్‌ స్క్రిప్షన్‌ కూడా అందిస్తున్నది.శాంసంగ్‌ గెలాక్సీ ఎక్స్‌ కవర్‌ 7 ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఔటాఫ్‌ బాక్స్‌ వర్షన్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్‌ 60 హెర్ట్జ్‌ రీఫ్రెష్‌ రేటుతోపాటు 6.6 -అంగుళాల ఫుల్‌ హెచ్డీ (1080 %ఞ%2408 పిక్సెల్స్‌) టీఎఫ్‌టీ డిస్‌ ప్లే కలిగి ఉంటుంది. సెల్పీ కెమెరా వద్ద వాడర్‌ డ్రాప్‌ స్టైల్‌ నాచ్‌ డిస్‌ ప్లే ఉంటుంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటెక్షన్‌ ఉంటది. అన్‌ నేమ్డ్‌ ఒక్టాకోర్‌ 6ఎన్‌ఎం ప్రాసెసర్‌, మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100 ఎస్వోసీ చిప్‌ సెట్‌ తో వస్తుంది.శాంసంగ్‌ గెలాక్సీ ఎక్స్‌ కవర్‌ 7 ఫోన్‌ సింగిల్‌ 50-మెగా పిక్సెల్‌ రేర్‌ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్‌ కోసం 5-మెగా పిక్సెల్‌ సెన్సర్‌ కెమెరా ఉంటాయి. 6జీబీ ర్యామ్‌ విత్‌ 128 జీబీ స్టోరేజీ కెపాసిటీ ఉన్నప్పటికీ మైక్రో ఎస్డీ కార్డ్‌ సాయంతో ఒక టిగా బైట్‌ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు.శాంసంగ్‌ గెలాక్సీ ఎక్స్‌ కవర్‌ 7 ఫోన్‌ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 802.11 ఏ/బీ/జీ/ఎన్‌/ఏసీ, వై-ఫై డైరెక్ట్‌, బ్లూటూత్‌ 5.3, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్‌ సీ పోర్ట్‌ విత్‌ పోగో పిన్‌, జీపీఎస్‌, గ్లోనాస్‌, 3.5 ఆడియో జాక్‌ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరో మీటర్‌, ప్రాగ్జిమిటీ సెన్సర్‌, జియో మ్యాగటిక్‌ సెన్సర్‌, లైట్‌ సెన్సర్‌, గైరో సెన్సర్‌, ఉంటాయి. అథంటికేషన్‌ కోసం ఫేస్‌ రికగ్నిషన్‌ ఫీచర్‌ ఉంటుంది. డోల్బీ ఆట్మోస్‌ సౌండ్‌ టెక్నాలజీతో కూడిన స్పీకర్లు ఉంటాయి.

➡️