హిలియోస్‌ ఎంఎఫ్‌ నుంచి కొత్త ఫండ్‌

Mar 12,2024 21:15 #Business

బ్యాలెన్డ్స్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌ : హిలియోస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా హిలియోస్‌ బ్యాలెన్డ్స్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ (బిఎఎఫ్‌)ను ఆవిష్కరించింది. ఈ కొత్త ఎన్‌ఎఫ్‌ఒ మార్చి 11న తెరువబడిందని.. 20న మూసివేయనున్నామని.. మార్చి 28 తర్వాత తిరిగి మళ్లీ అందుబాటులోకి వస్తుందని హిలియోస్‌ ఎంఎఫ్‌ సిఇఒ దిన్‌షా ఇరానీ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది తమకు రెండో ఎన్‌ఎఫ్‌ఒ అని తెలిపారు. ఈ నిధులను ఈక్విటీ మార్కెట్లు సహా రుణ, డెరివేటివ్స్‌, మనీ మార్కెట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడులుగా పెట్టనున్నామన్నారు. కొత్త బిఎఎఫ్‌లో కనీసం రూ.5వేల నుంచి పెట్టుబడిగా పెట్టచ్చన్నారు. నెల వారిగా అయితే ప్రతీ నెల కనీసం రూ.1,000 చొప్పున.. ఆ పైన ఎన్ని రెట్ల పెట్టుబడి అయినా పెట్టచ్చని తెలిపారు. కనీసం 12 మాసాల వాయిదాలను చెల్లించాల్సి ఉంటుంది. 2024 జనవరి నాటికి హైదరాబాద్‌లో తమ ఎయుఎం రూ.5,348 కోట్లుగా ఉందన్నారు. ఇటీవల బడ్జెట్‌ సమావేశాలు, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సాధారణంగానే మార్కెట్లు, ఎంఎఫ్‌ విభాగం కొంత స్తబ్దుగానే ఉండొచ్చని దిన్షా పేర్కొన్నారు. త్వరలో బ్యాంకింగ్‌, ఫైనాన్సీయల్‌ ఫండ్‌ను ఆవిష్కరించే యోచనలో ఉన్నామన్నారు. ఈ సమావేశంలో హిలియోస్‌ డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌ – సేల్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ జగదీష్‌ ప్రగాడ పాల్గొన్నారు.

➡️