స్పాటిఫైలో 17% ఉద్యోగులపై వేటు

Dec 5,2023 09:21 #Business

న్యూఢిల్లీ : ప్రముఖ మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ వేదిక స్పాటిఫై 17 శాతం ఉద్యోగులను ఇంటికి పంపించనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌లో 200 మందిని తొలగించిన సంస్థ మరోమారు ఉద్వాసనలకు సిద్దం అవుతోంది. పొదుపు, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా సిబ్బందిపై వేటు వేయనున్నట్లు స్పాటిఫై సిఇఒ డేనియల్‌ ఏక్‌ తెలిపారు. తమ సంస్థ మెరుగ్గా పని చేస్తున్నప్పటికీ ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ గొప్పగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారాన్ని పెంచుకునేందుకు అవసరమైన నిధుల సమీకరణ వంటి అంశాలు భారమయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల సంఖ్యను పునసమీక్షిస్తున్నామన్నారు. తమ భవిష్యత్‌ లక్ష్యాలకు అనుగుణంగా రాబోయే సవాళ్లను ఎదుర్కొనేలా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాల్సి వస్తుందన్నారు. సంస్థకు గొప్ప సేవలు అందించిన.. కష్టపడి పని చేసిన వారిని వదులు కోవాలంటే బాధగా ఉందన్నారు.

➡️