విప్రోలో తగ్గిన 24,516 మంది ఉద్యోగులు

Apr 19,2024 21:15 #Business

బెంగళూరు : ఐటి కంపెనీల్లో కొత్త ఉద్యోగ నియామకాలు తగ్గిపోగా.. మరోవైపు ఉన్న వారిని వేలల్లోనే తీసేసినట్లు తెలుస్తోంది. దేశంలోనే నాలుగో అతిపెద్ద ఐటి కంపెనీ విప్రోలో ఏడాదిలో 9.5 శాతం ఉద్యోగులు తగ్గారు. ఆర్థిక సంవత్సరం 2023ా24లో ఆ సంస్థలో నికరంగా 24,516 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. దీంతో 2024 మార్చి ముగింపు నాటికి 2,58,570 నుంచి 2,34,054 మంది ఉద్యోగులకు తగ్గారు. ఇదే విషయాన్ని ఆ కంపెనీ ఆర్థిక ఫలితాల సందర్బంగా వెల్లడించింది. 2023ా24 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో విప్రో నికర లాభాలు 8 శాతం తగ్గి రూ.2,835 కోట్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.3,074.5 కోట్ల లాభాలు సాధించింది. ఇదే సమయంలో రూ.23,190 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ4లో రూ.22,208 కోట్లకు తగ్గింది.

➡️