ఎఐ నిపుణులకు 50% అధిక వేతనం

న్యూయార్క్‌ : కృత్రిమ మేధా (ఎఐ)లోని నిపుణులు, ఇంజనీర్లకు టెక్‌ కంపెనీలు అధిక వేతనాన్ని ఆఫర్‌ చేస్తున్నాయి. సాధారణ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లతో పోల్చితే ఎఐ స్కిల్స్‌ కలిగిన వారికి 50 శాతం అధికంగా వేతనాలను పలు కంపెనీలు అందించడానికి ముందుకు వస్తున్నాయని లెవెల్స్‌.ఎఫ్‌వైఐ డేటా తెలిపింది. ఎఐ, ఎఐయేతర ఇంజనీర్ల మధ్య వేతన వ్యత్యాసాలు దాదాపు 50 శాతం వరకూ ఉన్నాయని విశ్లేషించింది. అమెరికాలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎఐ సాప్ట్‌వేర్‌ ఇంజనీర్ల వార్షిక వేతనం రూ.2.5 కోట్ల (3లక్షల డాలర్లు) వరకూ ఉండగా ఎఐయేతర టెకీల వేతనం కేవలం రూ. 83 లక్షలుగా ఉంది. ఎఐ, ఎఐయేతర సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల మధ్య ఈ వేతన వ్యత్యాసం 2022లో 30 శాతం ఉండగా.. ప్రస్తుతం ఇది దాదాపు 50 శాతానికి పెరిగింది. ఎఐలో మెరుగైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను తీసుకోవడంలో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా పోటాపోటీగా వ్యవహారిస్తున్నాయి.

➡️