తగ్గిన ద్రవ్యోల్బణం సూచీ

Feb 12,2024 20:42 #Business

న్యూఢిల్లీ : ప్రస్తుతేడాది జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) 5.10 శాతానికి తగ్గిందని నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసు (ఎన్‌ఎస్‌ఒ) తెలిపింది. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి అని పేర్కొంది. ఇంతక్రితం డిసెంబర్‌లో సిపిఐ 5.7 శాతంగా చోటు చేసుకుంది. జనవరిలో గ్రామీణ ప్రాంతాల్లో సిపిఐ 5.34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 4.92 శాతంగా నమోదయ్యింది.

➡️