ఫోన్‌పే షేర్‌.మార్కెట్‌ వేదికలో డిస్కవర్‌ విభాగం

Dec 7,2023 21:20 #Business

న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల వేదిక ఫోన్‌పేకు చెందిన షేర్‌.మార్కెట్‌ వేదికలో కొత్తగా ‘డిస్కవర్‌’ విభాగాన్ని ప్రారంభించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. దీని అత్యాధునిక ఇంటెలిజెన్స్‌ లేయర్‌ ద్వారా ఇన్వెస్టర్లకు మెరుగైన పెట్టుబడి అనుభవాన్ని సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ జోడింపు ద్వారా పరిశోధన ఆధారిత ఉత్పత్తులు, అనుభవాలను తీసుకురావడంతో పాటుగా డిస్కౌంట్‌ బ్రోకింగ్‌ను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఇది తమ పెట్టుబడిదారుల విభిన్న అవసరాలను తీర్చడానికి రూపొందించబడిందని షేర్‌.మార్కెట్‌ సిఇఒ ఉజ్జల్‌ జైన్‌ తెలిపారు.

➡️