వ్యవసాయ ఎగుమతుల్లో.. ఐదు ఉత్పత్తులదే సగంపైగా వాటా

Dec 25,2023 20:33 #Business

న్యూఢిల్లీ: భారత వ్యవసాయ రంగ మొత్తం ఎగుమతుల్లో కేవలం ఐదు ఉత్పత్తులే 51.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ (జిటిఆర్‌ఐ) రిపోర్ట్‌ ప్రకారం.. బాస్మతి బియ్యం, బాస్మతీయేతర బియ్యం, చక్కెర, సుగంధ ద్రవ్యాలు, వంట నూనెలు మెజారిటీ వాటాను కలిగి ఉన్నాయి. ఈ ఉత్పత్తులపైనే వ్యవసాయ రంగం ఎగుమతులు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఇవి ప్రపంచ స్థాయిలో ధరలు, డిమాండ్‌ను ప్రభావితం చేస్తాయి. కాగా.. ఈ రంగం మౌలిక సదుపాయాల లోపాలు, నాణ్యత నియంత్రణ సమస్యలు, టారిఫ్‌ అడ్డంకులు తదితర సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇవి భారత వ్యవసాయ రంగ ఎగుమతుల్లో వృద్థి, పోటీతత్వానికి ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి.

➡️