హెచ్‌ఆర్‌హెచ్‌ నెక్ట్స్‌ సర్వీసెస్‌ లిస్టింగ్‌

Jan 3,2024 21:26 #Business

హైదరాబాద్‌ : బిపిఒ సేవలందించే హెచ్‌ఆర్‌హెచ్‌ నెక్ట్స్‌ సర్వీసెస్‌ బుధవారం నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ (ఎన్‌ఎస్‌ఇ) ఎస్‌ఎంఇ వేదికలో లిస్టింగ్‌ అయ్యింది. ఉదయం 13.86 శాతం ప్రీమియంతో రూ.41 వద్ద ప్రారంభమైంది. దీని ఇష్యూ ధర రూ.36గా ఉంది. డిసెంబర్‌ 27తో ఆ సంస్థ ఐపిఒ ముగిసింది. ఈ సంస్థకు బ్యాంకింగ్‌, ప్రభుత్వ, విద్యా, వైద్యం, ఫుడ్‌టెక్‌, ఇ-కామర్స్‌ తదితర రంగాల్లో క్లయింట్లను కలిగి ఉంది. ముంబయిలో ఎన్‌ఎస్‌ఇ నుంచి లిస్టింగ్‌ సర్టిఫికెట్‌ను హెచ్‌ఆర్‌హెచ్‌ నెక్ట్స్‌ సర్వీసెస్‌ ఎండి అంకిత్‌ షా అందుకున్నారు.

➡️