హ్యుందాయ్ రూ.6వేల కోట్ల పెట్టుబడులు

Jan 8,2024 21:04 #Business, #Hyundai

చెన్నయ్ : ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్‌ ఇండియా భారీ పెట్టుబడులను ప్రకటించింది. తమిళనాడులో కొత్త ప్రాజెక్ట్‌ల కోసం మరో రూ.6,180 కోట్ల పెట్టుబడుల ప్ర ణాళికలను వెల్లడించింది. ఇందుకోసం తమిళనాడు ‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ 2024’ కార్యక్రమంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ మొత్తం గతంలో ప్రకటించిన పెట్టుబడులకు అదనమని వెల్లడించింది. వచ్చే పదేళ్లలో తమిళనాడులో రూ.20 వేల కోట్లతో విద్యుత్తు వాహనాల తయారీ, ఇవి ఛార్జింగ్‌ సదుపాయాలు ఏర్పాటు చేయడంతోపాటు నైపుణ్య శిక్షణ కోసం పెట్టుబడులు పెట్టనున్నట్లు గతంలో ప్రకటించింది.

➡️