గృహ రుణాల్లో ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ వృద్ధి

May 23,2024 21:21 #Business

ప్రజాశక్తిావిజయవాడ అర్బన్‌: ఐఐఎఫ్‌ఎల్‌ హోమ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ అసెస్‌ మేనేజ్‌మెంట్‌ ఇయర్‌లో 25 శాతం వృద్ధి సాధించినట్లు సంస్థ రీజనల్‌ హెడ్‌ కె.ఎం.ప్రకాష్‌ తెలిపారు. విజయవాడలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఈ వివరాలను తెలియచేశారు. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.2,712 కోట్ల నుండి 2024 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.3317 కోట్లకు పెరిగిందని తెలిపారు. గృహ రుణాలను సులభతరంగా అందించడంలో తమ సంస్థ ముందుంటుందని తెలిపారు. ఎప్పటికప్పుడు వినియోగదారులకు సమాచారం అందించడంతో పాటు సంస్థ వృద్ది కార్యకలాపాలను కూడా తెలియచేస్తున్నామని తెలిపారు. రానున్న కాలంలో మరింత వృద్ధి సాధించేందుకు ఇప్పటి నుండే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

➡️