రూ.8,490 కోట్లకు మోతిలాల్‌ ఓస్వాల్‌ మిడ్‌క్యాప్‌ ఎయుఎం

Mar 16,2024 21:11 #Business, #Motilal Oswal

ముంబయి : మోతీలాల్‌ ఓస్వాల్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ ఎయుఎం రూ.8,490 కోట్లకు చేరిందని ఆ సంస్థ తెలిపింది. తమ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ 10 ఏళ్ల వార్షికోత్సవాలను జరుపుకుంటుందని పేర్కొంది. 2024 జనవరి 31 నాటికి 2,126 ప్రత్యేక పిన్‌ కోడ్‌లో 5.3 లక్షల మంది ప్రత్యేక పెట్టుబడిదారులు ఫండ్‌లో పెట్టుబడి పెట్టడంతో రిటైల్‌ పెట్టుబడిదారుల భాగస్వామ్యం పెరిగిందని తెలిపింది. ఇది మోతీలాల్‌ ఓస్వాల్‌ గ్రూప్‌పై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రదర్శిస్తుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ అఖిల్‌ చతుర్వేది అన్నారు. మిడ్‌క్యాప్‌ ఒక కేటగిరీగా 2004 నుండి ఇప్పటి వరకు మంచి పనితీరును కనబరుస్తోందన్నారు.

➡️