ఏడాది చివరి నాటికి నిఫ్టీ 25,810కి చేరొచ్చు

Apr 27,2024 21:12 #Business

ప్రభుదాస్‌ లిల్లాధర్‌ అంచనా
ముంబయి : ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 25,810కి చేరొచ్చని ప్రభుదాస్‌ లిల్లాధర్‌ తన తాజా ఇండియా స్ట్రాటజీ నివేదికలో పేర్కొంది. సాధారణ రుతుపవనాల కొనసాగింపు, ఎన్‌డిఎ ప్రభుత్వం కొనసాగితే నిఫ్టీలో పెరుగుదల ఉండొచ్చని తెలిపింది. రాబోయే 12 నెలల కాలానికి లేదా డిసెంబర్‌ 2025 నాటికి 25810 నుంచి 27100కి చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ఒక వేళ ట్రెండ్‌ రివర్స్‌ అయి బేర్‌ కేర్‌ ట్రెండ్‌లో పడినట్లయితే 1శాతం తగ్గి 23వేల స్థాయిలకు చేరువలో ఉండొచ్చని ప్రభుదాస్‌ లిల్లాధర్‌ ఇన్స్టిట్యూషనల్‌ రీసెర్చ్‌ హెడ్‌ అమ్నీష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఈ దశాబ్దంలో కీలక ఘట్టమైన సాధారణ ఎన్నికలలో జూన్‌ 4 వరకు మార్కెట్‌ పతనమయితే స్టాక్స్‌ కొనుగోళ్లకు అనుకూల సమయమన్నారు.

➡️