12 శాతం పెరిగిన థాలీ ధర-ఎఫ్‌ఎంసిజి అమ్మకాల్లో స్తబ్దత

Jan 13,2024 21:25 #Business

న్యూఢిల్లీ : దేశంలో శాఖహారం ధరలు పెరిగాయి. ఏడాదికేడాదితో పోల్చితే 2023 డిసెంబర్‌లో థాలీ (ప్లేట్‌) భోజనం ధర 12 శాతం భారమయ్యిందని రీసెర్చ్‌ సంస్థ క్రిసిల్‌ వెల్లడించింది. మరోవైపు మాంసహార ప్లేట్‌ ధర 4 శాతం తగ్గిందని వెల్లడించింది. శాఖాహారం థాలీలో రోటీ, కూరగాయలు (ఉల్లిపాయ, టమాటో మరియు బంగాళాదుంప), అన్నం, పప్పు, పెరుగు మరియు సలాడ్‌ ఉంటాయి. మాంసాహార థాలీలో పప్పుకు బదులుగా చికెన్‌ ఉంటుంది. గడిచిన డిసెంబర్‌ మాసంలో ఉల్లి, టమాటా ధరలు వరుసగా 82 శాతం, 42 శాతం పెరగడంతో శాఖాహారం థాలీ ధర గణనీయంగా పెరిగిందని క్రిసిల్‌ పేర్కొంది. వెజ్‌ థాలీలో 9 శాతం వాటా కలిగిన పప్పుల ధరలు కూడా సంవత్సరానికి 24 శాతం పెరిగాయని పేర్కొంది. అధిక ఉత్పత్తి వల్ల బ్రాయిలర్‌ చికెన్‌ ధరలు 15 శాతం తగ్గుదల కారణంగా మాంసహార థాలీ ధర తగ్గిందని పేర్కొంది. మరోవైపు గతేడాది జులై- సెప్టెంబర్‌ కాలంలో ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తుల అమ్మకాల్లో స్తబ్దత చోటు చేసుకోవడంతో ఆ కంపెనీల ఆదాయాల్లో యథాతథంగా నమోదయ్యాయి.

➡️