అంగన్వాడీలకు ‘అనగాని’ కుర్చీలు

ప్రజాశక్తి-రేపల్లె: అంగన్వాడీ సెంటర్లో జరిగే మీటింగ్‌లలో కూర్చొటానికి కుర్చీలు అందజేసినట్లు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. ఇటీవల అంగన్వాడీలు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపేందుకు శిబిరాన్ని సందర్శించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్‌ దృష్టికి అంగన్వాడీలు కుర్చీలు కూడా లేవని తీసుకొచ్చారు. సెంటర్‌కు 192 కుర్చీలు ఇవ్వమని అంగన్వాడీలు కోరారని చెప్పారు. వెంటనే స్పందించిన అనగాని మంగళవారం కుర్చీలను అందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జిపి రామారావు, జివి నాగేశ్వరరావు, సిపిఎం పట్టణ కార్యదర్శి సిహెచ్‌ మణిలాల్‌, వడ్డీ లక్ష్మోజీ, సూరగాని సోములు, వాకా వెంకటేశ్వరరావు, యరగళ్ల ధర్మతేజ తదితరులు పాల్గొన్నారు.

➡️