అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి

ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమగోదావరి) : అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాడ్యుటి అమలు చేయాలని దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం అంగన్వాడి కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా సహాయ కార్యదర్శి ఎండి హసీనా బేగం అధ్యక్షత వహించారు. సభలో పాల్గొన్న సిఐటియు మండల కార్యదర్శి పి.గోవిందు మాట్లాడుతూ.. అంగన్వాడీ కార్యకర్తలకు ఉన్న సమస్యలను పరిష్కరించాలని సుదీర్ఘకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తప్పని పరిస్థితుల్లో అంగన్వాడీలు సమ్మెకు దిగారని చెప్పారు. వారి న్యాయమైన కోరికలు పరిష్కారానికి చేస్తున్న సమ్మెకు సిఐటియు తమ పూర్తి మద్దతు ప్రకటించిందని చెప్పారు. సభలో పాల్గొన్న అంగన్వాడి వర్కర్స్‌ హెల్పర్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కే ఝాన్సీ లక్ష్మీ మాట్లాడుతూ.. అంగన్వాడీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తానని చెప్పిన హామీలు ఎంతవరకు అమలు కాలేదని అన్నారు అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కరువైందని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు వేతనంతో కూడిన మెడికల్‌ సెలవులు వర్తింపజేయాలని అన్నారు అంగన్వాడీ సమస్యల పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా గణపవరం మండలంలో ఉన్న 64 కేంద్రాలకు సంబంధించిన అంగన్వాడీలు సమ్మెలో పాల్గొన్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు ఎం పెంటారావు అంగన్వాడి నాయకురాలు బి రామకోటి వెంకటలక్ష్మి కె.వి మహాలక్ష్మి జయలక్ష్మి ఎస్‌ లక్ష్మి పాల్గొన్నారు

➡️