అంగన్‌వాడీలతో దద్దరిల్లిన రోడ్లు

అంగన్‌వాడీలతో దద్దరిల్లిన రోడ్లు

తమ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అంగన్‌వాడీల సమ్మె శుక్రవారం నాటికి 11వ రోజుకి చేరింది. జిల్లావ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు.ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, యంత్రాంగంకాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద రాస్తారోకో నిర్వహించారు. సామర్లకోట- కాకినాడ మెయిన్‌ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి రమణమ్మ, నాయకులు జ్యోతి, నీరజ, విజయ పాల్గొన్నారు. సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యాన ఇంద్రపాలెం లాకుల వద్ద అంగన్‌వాడీలకు మద్దతుగా ధర్నా చేశారు. ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు మాట్లాడారు. జిల్లా నాయకులు మల్లాడి భైరవస్వామి, బంగారు సత్యనారాయణ, కె.నరసింహ, శ్రీపాదం సత్తిబాబు, బొడ్డు సత్యనారాయణమూర్తి, పాలెపు అర్జునరావు పాల్గొన్నారు. కిర్లంపూడి ప్రధాన కూడలి వద్ద రాస్తారోకో చేసి రహదారిపై బైఠాయించారు. ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు సిహెచ్‌.రత్నం, సిఐటియు నాయకుడు టి.జీవ, పి.సావిత్రి, షేక్‌ పరివిన్‌, జి.రత్నం, పి.మంగాయమ్మ, పి.ప్రభావతి, హసీనా బేగం పాల్గొన్నారు.కరప తహశీల్దారు కార్యాలయం వద్ద సమ్మె శిబిరం నుంచి స్థానిక గ్రామపంచాయతీ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బజార్‌ సెంటర్‌లో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ప్రాజెక్టు నాయకురాలు పి.వీరవేణి మాట్లాడారు. ఎస్‌.వరలక్ష్మి, ఎస్‌ఎస్‌.కుమారి, దైవ కుమారి, ఆశారత్నం, కల్పలత, సత్యమాధవి. ఎం.భవాని, నారాయణమ్మ, జ్యోతి, కల్పలత, పి.లక్ష్మి, ఎ.దేవి, బి.మనోజ, లక్ష్మి, సాయి దుర్గ, బి.భవాని పాల్గొన్నారు.తాళ్లరేవు తహశీల్దారు కార్యాలయం ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. ప్రజా సంఘాల నాయకులు అంగన్వాడీలకు మద్దతుగా నిలిచారు. పి.ఆదిలక్ష్మి మాట్లాడారు. ప్రజా సంఘాల నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, అత్తిలి బాబూరావు, ఎం.తణుకు రాజు, విప్పర్తి శ్రీనివాస్‌, ఉంగరాల వెంకటేశ్వరరావు వారికి మద్దతు తెలిపారు. కె.ఉష, అరుణ, శ్రీదేవి, పార్వతి, నిర్మల, సత్య పాల్గొన్నారు. పిఠాపురం : పుర వీధులు, మెయిన్‌ రోడ్లపై భిక్షాటన చేశారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద రాస్తారోకో నిర్వహించారు. డి.పద్మ, సిఐటియు నాయకులు కె.చిన్న మాట్లాడారు. ప్రజా సంఘాల నాయకులు కె.విశ్వనాథం, జి.వీరబాబు, సూర్యనారాయణ, కోనేటి రాజు, వెంకటలక్ష్మి, ఝాన్సీ మద్దతు తెలిపారు. డి.తులసీదేవి, అమల, వెంకటలక్ష్మి, విజయశాంతి, ప్రజావాణి, నళిని, భవాని పాల్గొన్నారు.కాజులూరు పంచాయతీ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. మానవహారం నిర్వహించారు. హైస్కూల్‌ సెంటర్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ప్రజా సంఘాల నాయకులు అంగన్వాడీలకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా టి.వరలక్ష్మి మాట్లాడారు. హనుమావతి, అన్నవరం, వివిఎస్‌.నాగమ్మ, ఎన్‌.అరుణ, రామలక్ష్మి, నాగరత్నం, కె.భవాని, వై.మంగాదేవి, ఒ.సత్యవేణి పాల్గొన్నారు.పెద్దాపురం స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ వ్యాఖ్యలకు నిరసనగా అంగన్వాడీలు పాత బస్టాండ్‌ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. మున్సిపల్‌ సెంటర్‌ నుంచి మెయిన్‌ రోడ్‌, వినాయకుని గుడి సెంటర్‌, డైలీ మార్కెట్‌ సెంటర్‌, రాజు గారి వీధి మీదుగా పాత బస్టాండ్‌ సెంటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి.బేబీ, ఎస్తేరు రాణి, నాగమణి, అమల, ఫాతిమా, టిఎల్‌.పద్మావతి, కాలే దేవి, జె.సూర్యకుమారి, జ్యోతి, లోవతల్లి, వసంత కుమారి, వెంకటలక్ష్మి, నాగమణి, స్నేహలత, సావిత్రి, రత్నం, లక్ష్మి పాల్గొన్నారు. సమ్మెకు సిఐటియు నేతలు సిరపరపు శ్రీనివాస్‌, చింతల సత్యనారాయణ, వడ్డి సత్యనారాయణ, దారపురెడ్డి కృష్ణ, డి.క్రాంతి కుమార్‌, డి.నారాయణ, డి.నాగ విష్ణు మద్దతు తెలిపారు.కోటనందూరు తహశీల్దారు కార్యాలయం వద్ద సమ్మెకు సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌కె.పద్మ మద్దతు తెలిపారు. రవణమ్మ, పద్మ, లీల, శ్రీదేవి, నాగమణి, జగతి, లక్ష్మి, నూకరత్నం, సురలక్ష్మి, వెంకటలక్ష్మి, సత్యవతి పాల్గొన్నారు.ఏలేశ్వరం తహశీల్దారు కార్యాలయం వద్ద రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సహకార ఉద్యోగుల సంఘం నేత కడగల ఆదినారాయణ మద్దతు తెలిపారు. కాకరపల్లి సునీత, ఎన్‌.అమలావతి, పి.గంగాభవాని, కె.బంగారు పాప, పి.నూకరత్నం, బి.ప్రభావతి, జె.రాణి, సిహెచ్‌.వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

➡️