అంగన్‌వాడీలపై దాడికి సిఐటియు నిరసన ర్యాలీ

Jan 21,2024 21:49
ఫొటో : నిరసన తెలియజేస్తున్న సిపిఎం, సిఐటియు నాయకులు

ఫొటో : నిరసన తెలియజేస్తున్న సిపిఎం, సిఐటియు నాయకులు
అంగన్‌వాడీలపై దాడికి సిఐటియు నిరసన ర్యాలీ
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : అంగన్‌వాడీలపై, సిఐటియు నాయకులపై పోలీసులు జరిపిన దాడికి నిరసన తెలియజేస్తూ ఇందుకూరుపేట మండల సిపిఎం, సిఐటియు నాయకులు నల్ల జెండాలతో ఇందుకూరుపేట ఆటో స్టాండ్‌ నుండి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీలపై దాడులు ఆగాలని నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఎస్‌.కె.చాన్‌బాషా మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన కోరికను నెరవేర్చాలని గత 40రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ఓర్వలేని ప్రభుత్వం మహిళలలు అని కూడా చూడకుండా లాఠీఛార్జ్‌ చేయడం అమానుషమన్నారు. తమ నాయకులు అంగన్‌వాడీల పక్షాన పోరాడుతుంటే తమ నాయకులను కూడా ఇష్టానుసారంగా పోలీసులు దాడి చేశారన్నారు. వైసిపి ప్రభుత్వం అంగన్‌వాడీలను చిన్నచూపు చూస్తుందన్నారు. అంగన్‌వాడీల కోర్కెలు నెరవేర్చని పక్షంలో ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. తమ నాయకులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, రైతుసంఘం నాయకులు తిక్కవరపు ప్రభాకర్‌ రెడ్డి, ఆటో యూనియన్‌ నాయకులు మనోహర్‌, నాయుడు, మాల్యాద్రి, తదితరులు పాల్గొన్నారు.

➡️