అంగన్వాడీలు రాస్తారోకో

వినుకొండలో రాస్తారోకో చేస్తున్న అంగన్వాడీలు
ప్రజాశక్తి – వినుకొండ :
స్థానిక సురేష్‌ మహల్‌రోడ్‌లోని సమ్మె శిబిరాన్ని శివశక్తి లీలా ఫౌండేషన్‌ అధ్యక్షులు, టిడిపి నాయకులు జి.లీలావతి సందర్శించి మద్దతుగా మాట్లాడారు. చిన్నారులకు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం దుర్మార్గమన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే సమస్యలను పరిష్కస్తామని చెప్పారు. మద్దతు తెలిపిన వారిలో టిడిపి నాయకులు ఆయాబుఖాన్‌, పివి సురేష్‌బాబు, పి.కృష్ణ, రైతు సంఘం నాయకులు సత్యనారాయణ, సిపిఎం నాయకులు పి.ఆశీర్వాదం, విశ్రాంత ఉపాధ్యయులు జి.నాగేంద్ర ఉన్నారు. ఇదిలా ఉండగా సమ్మెలో భాగంగా అంగన్వాడీలు స్థానిక శివయ్య స్తూపం సెంటర్‌లో అరగంట పాటు రాస్తారోకో చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతరెడ్డి, ఎఐటియుసి ఏరియా ప్రధాన కార్యదర్శి బి.శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి యు.రాము, సిఐటియు పట్టణ కార్యదర్శి ఎ.ఆంజనే యులు, అంగనవాడి యూనియన్‌ నాయకులు ఏం.శారమ్మ పి.ఉమాశంకరి, నాగజ్యోతి, జి.పద్మ మాట్లాడారు.ప్రజాశక్తి – మాచర్ల :స్థానిక బస్టాండ్‌ సెంటర్లో రాస్తారోకో చేశారు. సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయనాయక్‌, డివిజన్‌ నాయకులు బి.మహేష్‌ మద్దతుగా మాట్లా డారు. ఉషారాణి, కోటేశ్వరి, ఇందిరా, మల్లేశ్వరి పాల్గొన్నారు.ప్రజాశక్తి-పిడుగురాళ్ల : స్థానిక సమ్మె శిబిరంలో అంగన్వాడీలు మోకాళ్లపై నిలిచి నిరసన తెలిపారు. సిఐటియు నాయకులు టి.శ్రీనివాసరావు మాట్లాడారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టొద్దని కోరుతూ మున్సిపల్‌ కమిషనర్‌ బి.వెంకటేశ్వర రావుకు వినతిపత్రం ఇచ్చారు. సమ్మె శిబిరాన్ని ఐద్వా నాయకులు డి.భూలక్ష్మి, సుజాత, సరస్వతి, కాంగ్రెస్‌ పార్టీ గురజాల నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎలమందరెడ్డి, లక్ష్మణ్‌రావు, శ్రీనునాయక్‌ సందర్శించి సంఘీభావం తెలిపారు. సిఐటియు నాయకులు బి.వెంకటేశ్వర్లు, అంగన్వాడీ నాయకులు బి.శాంతమణి, ఎస్‌కె హజ్ర, బుజ్జి, సుజాత, శైలజ, శివరంజని, కవిత, ఊర్మిళ పాల్గొన్నారు. ప్రజాశక్తి- క్రోసూరు : స్థానిక అంబేద్కర్‌ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు జి.రవిబాబు మాట్లాడారు. వైసిపి తన సొంతమీడియా, సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. పత్రిక ప్రతులను దహనం చేశారు.ప్రజాశక్తి – చిలకలూరిపేట: స్థానిక పండరిపురంలోని సిఐటియు కార్యాలయం నుండి ఎన్‌ఆర్‌టి సెంటర్‌లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకూ భారీ ప్రదర్శన చేశారు. నరసరావుపేట రోడ్డులో బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సిఐటియు మండల కన్వీనర్‌ పి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. కెవిపిఎస్‌ నాయకులు ఎం.విల్సన్‌, జెవివి నాయకులు టి.ప్రతాప్‌రెడ్డి, పట్టణ రిక్షా సంఘం నాయకులు బి.కోటానాయక్‌, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్‌ అధ్యక్షులు ఎస్‌.లూథర్‌, భవన నిర్మాణ రంగం నాయకులు ఎస్‌.బాబు మద్దతు తెలిపారు. అంగన్వాడీ యూనియన్‌ సెక్టార్‌ అధ్యక్షులు జి.సావిత్రి, నాయకులు ఎస్‌.వెంకటసుబ్బమ్మ పాల్గొన్నారు.ప్రజాశక్తి – అమరావతి : అంబేద్కర్‌ విగ్రహం వద్ద గంటపాటు రాస్తారోకో చేశారు. సిఐటియు మండల కార్యదర్శి బి.సూరిబాబు, ఎఐటియుసి నాయకులు ఎం.శ్రీనివాసరావు మాట్లాడారు. అనంతరం ప్రదర్శనగా సమ్మె శిబిరానికి వెళ్లి చెవిలో పూలతో నిరసన తెలిపారు.ప్రజాశక్తి – కారంపూడి :స్థానిక చెక్‌ పోస్ట్‌ సెంటర్‌లో సమ్మె శిబిరం కొనసాగింది.ప్రజాశక్తి – పెదకూరపాడు : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం కచేరి సెంటర్‌ వరకు ప్రదర్శన చేసి మానవహారంగా ఏర్పడ్డారు. బస్టాండ్‌లో ఉడ్చి నిరసన తెలిపారు.

➡️