అంగన్‌వాడీల ఆందోళనకు మద్దతు

Dec 14,2023 18:14
అంగనవాడీల సమ్మెకి మద్దతు తెలుపుతున్న ఇంటూరి నాగేశ్వరరావు

అంగనవాడీల సమ్మెకి మద్దతు తెలుపుతున్న ఇంటూరి నాగేశ్వరరావు
అంగన్‌వాడీల ఆందోళనకు మద్దతు
ప్రజాశక్తి-కందుకూరు
కందుకూరు ప్రాజెక్టులో మూడవ రోజు అంగన్వాడి సమ్మె విజయ వంతంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు కే రాజేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సమస్యలు పరిష్కరించాలని మోకాళ్ళ మీద నిలబడి అంగన్వాడీలు నిరసన తెలియజేశారు. సభ దగ్గరకు తెలుగుదేశం కందుకూరు నియోజక వర్గఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు వచ్చి అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం మద్దతు తెలియజేశారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని వాటికోసం మేము కూడా మద్దతు తెలుపుతున్నామని తెలియజేశారు. ఈ సభలో మహిళా సంఘం నాయకులు ఎస్‌.కె మున్వర్‌ సుల్తానా మాట్లాడుతూ ప్రభుత్వాలు మహిళా సంక్షేమం అని అంటూనే మహిళలని బజారున పడేస్తున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల పోరాటానికి అండగా ఉంటామని కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు గౌరవాధ్యక్షులు సిఐటియు నాయకులు ఎస్‌ఏ గౌస్‌, ప్రాజెక్టు కార్యదర్శి ఎస్‌ కె రామతున్నిసా, వివి పాలెం మండల సిఐటియు నాయకులు సరస్వతి ,ఏ అనురాధ ,ప్రభావతి, రాధా, శశి, సిఐటియు ఉలవపాడు మండల బాధ్యులు జీవీబీ కుమార్‌ సిఐటియు పట్టణ అధ్యక్షులు డి రామ్మూర్తి పాల్గొన్నారు.

➡️