అంగన్‌వాడీల భారీ ప్రదర్శన

Dec 18,2023 20:31
కందుకూరులో మానవ హరం నిర్వహిస్తున్న అంగన్‌వాడీలు

కందుకూరులో మానవ హరం నిర్వహిస్తున్న అంగన్‌వాడీలు
అంగన్‌వాడీల భారీ ప్రదర్శన
ప్రజాశక్తి-కందుకూరుఅంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత ఏడు రోజుల నుంచి వారు చేస్తున్న సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదు. దీంతో సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో కందుకూరులో భారీ ర్యాలీ, మానవహరం చేపట్టారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. గత ఏడు రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలను ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చర్చలలో తమకు సరైన హామీ ఇవ్వక పోవడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో కందుకూరు సబ్‌ కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద కందుకూరు అర్బన్‌, కందుకూరు రూరల్‌, వలేటివారిపాలెం, లింగసముద్రం, ఉలవపాడు, గుడ్లూరు, వరికుంటపాడు మండలాలకు చెందిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు సుమారు 600 మంది సోమవారం సబ్‌ కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంగన్‌వాడీలు నిరవధిక సమ్మె ఏడు రోజుల నుంచి చేస్తున్న పట్టించుకోకపోవడం సిగ్గుచేటని నినదించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి జీ వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా నాయకులు జీవిబి కుమార్‌,ఎస్‌.ఏ.గౌస్‌ తోపాటు అంగన్వాడి లీడర్లు ఆర్‌.సరస్వతి, వాకా.లతా రెడ్డి, ప్రభావతి మాట్లాడారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చి తమ సమస్యలను వివరించారు. పట్టణంలో కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద నుండి ఓవి రోడ్‌, పోస్ట్‌ ఆఫీస్‌ సెంటర్‌, పామూరు రోడ్‌, ప్రభుత్వ హాస్పిటల్‌ మీదగా బైపాస్‌ రోడ్‌, సుందరయ్య భవన్‌, అంకమ్మ గుడి నుండి పోస్ట్‌ ఆఫీస్‌ సెంటర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోస్ట్‌ ఆఫీస్‌ సెంటర్‌ లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వర్లు మాట్లాడారు. సిఐటియు నాయకులు డి రామ్మూర్తి,ఎస్‌ పవన్‌ కుమార్‌, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దువ్వూరి జాన్‌, డిఎం రాయుడు, అంగన్వాడీ యూనియన్‌ రాష్ట్ర నాయకురాలు ఏ. అనురాధ, కందుకూరు, ఉలవపాడు ప్రాజెక్టు లీడర్లు ఎస్‌ కే. రహంతున్నీసా, రాజేశ్వరి, సిహెచ్‌ ఇందిరావతి, అన్ని మండలాల నాయకులు ఎస్‌ కే పద్మజ, బీ మార్తమ్మ, ఉమామహేశ్వరి,గీత, సిహెచ్‌ పద్మజ, ఎం పద్మ, జి శశి, నాగమణి, సిహెచ్‌ రమాదేవి, కాకర్లపూడి శైలజ, డి వరలక్ష్మి, డి రమాదేవి,పర్రె తిరుపతమ్మ, పంతగాని రమణ ఉన్నారు.

➡️