అంగన్‌వాడీల భిక్షాటన

Dec 22,2023 20:33
ఫొటో : భిక్షాటన చేస్తున్నఅంగన్‌వాడీలు

ఫొటో : భిక్షాటన చేస్తున్న అంగన్‌వాడీలు
అంగన్‌వాడీల భిక్షాటన
ప్రజాశక్తి-అనంతసాగరం : నిరవధిక సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు శుక్రవారం భిక్షాటన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. అంగన్‌వాడీల సమ్మెకు మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగల పుల్లయ్య మద్దతు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం పూర్తిగా మద్దతు ప్రకటిస్తుందన్నారు. అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలపై ప్రభుత్వం చర్చించి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ అనంతసాగరం అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) నాయకులు నూర్జహాన్‌, సునీత మాట్లాడుతూ గత 10రోజులు నుండి తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం స్పందన లేకపోవడం దుర్మార్గమన్నారు. కనీస వేతనాలు గ్రాట్యూటీ వంటి సమస్యలపై చర్చించకుండా కేవలం ఉపయోగంలో లేని సమస్యలపై చర్చించామని చెప్పడం దారుణమన్నారు. ప్రభుత్వం ఇచ్చే కనీస వేతనం చాలడం లేదని తాము భిక్షాటన ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి అన్వర్‌ బాషా, అనంతసాగరం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు సుబ్బమ్మ, భాగ్యమ్మ, సల్మా, సునీత, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

➡️