అంగన్‌వాడీల వినూత్న నిరసన

ప్రజాశక్తి-చీరాల: ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా అంగన్వాడీలు ప్రదర్శనగా వెళ్లి మంగళవారం దున్నపోతుకు వినతిపత్రం అందజేశారు. గత 22 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. మంగళవారం దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. మూడో తేదీ కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం ఉంది. అప్పటికీ ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ రోజు కార్యక్రమానికి సిపిఎం, సిపిఐ నాయకులు ఎన్‌ బాబురావు, మేడా వెంకట్రావు పాల్గొని మద్దతు తెలియజేశారు. ఐక్యంగా పోరాడాలని, రాష్ట్రంలోని ప్రజా సంఘాలు, అనేక పార్టీలు అండగా ఉంటాయని అన్నారు. విజయం సాధించే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి ఎం వసంతరావు, ప్రమీల, జి సుజీవన, బ్యూలా, సులోచన శిరీష తదితరులు పాల్గొన్నారు. పంగులూరు: న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని, పంగులూరు మండలం అంగన్వాడీలు చెప్పారు. గత 22 రోజులుగా పంగులూరు తహశీల్దారు కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు, మంగళవారం కూడా సమ్మెను కొనసాగించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, సమ్మెను ఆపేది లేదని అన్నారు. అనంతరం నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

➡️