అంగన్‌వాడీ సమస్యలపై కాలయాపన తగదు

 ప్రజాశక్తి-ఉక్కునగరం : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు లేబర్‌ యూనియన్‌ (సిఐటియు) అధ్యక్షులు జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఉక్కునగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అంగన్‌వాడీ వర్కర్లను కనీసం కార్మికులుగా కూడా గుర్తించకపోవడం అన్యాయం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో హక్కుల గురించి అడిగితే చంద్రబాబు గుర్రాలతో తొక్కించారని, తరువాత ఎన్నికల్లో ఆ ప్రభుత్వం కూలి పోయిందని తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ముందుకు రాకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు ఒవి.రావు, నమ్మి రమణ, కెఎం.శ్రీనివాస్‌, పి.శ్రీనివాసరాజు, కె.సత్యవతి, పి.నారాయణరావు, ఎన్‌.కృష్ణ, యు.సోమేష్‌, డి.పాండే, కెపి.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

➡️