అట్టహాసంగా జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు

Dec 21,2023 22:12
శ్రీకాళహస్తిలో భారీ కేక్‌ కట్‌ చేసి సిఎం జన్మదినాన్ని వేడుకగా జరిపిన ఎంఎల్‌ఎ బియ్యపు మధుసూదన్‌రెడ్డి

అట్టహాసంగా జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజుప్రజాశక్తి – యంత్రాంగం ఎన్నికల వేళ.. సిఎం జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు అట్టహాసంగా జరిగింది. తడలో ఎంఎల్‌ఎ కిలివేటి సంజీవయ్య, పిచ్చాటూరులో ఎంఎల్‌ఎ కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఓజిలిలో మండల కన్వీనర్‌ హరినాథ్‌రెడ్డి, జడ్‌పిటిసి రవీంద్రరాజు ఆధ్వర్యంలో కేక్‌కట్‌చేసి పంచిపెట్టారు. శ్రీకాళహస్తిలో ఎంఎల్‌ఎ బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్‌ కట్‌ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నాయి బ్రాహ్మణులు, జంగమ దేవరులు, టైలర్లు, చిరు వ్యాపారులకు ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి వారి వత్తులకు సంబంధించిన పనిముట్లను ఉచితంగా వితరణ చేశారు. వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ భారీ కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. కెవిబిపురంలో మండల కన్వీనర్‌ గవర్ల క్రిష్ణయ్య ఆధ్వర్యంలో జరిగింది. గూడూరులో ఎంఎల్‌ఎ వరప్రసాద్‌రావు, ఎంఎల్‌సి మేరిగ మురళీధర్‌ నిర్వహించారు. విజయవాడలో ఎప బిషప్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ పాల్గొని సిఎంకు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ప్రజాప్రస్థానం సేవా ట్రస్టు ఛైర్మన్‌ డాక్టర్‌ పిసిరాయులు ఆధ్వర్యంలో 500 మందికి అన్నదానం చేశారు. వరదయ్యపాలెంలో మండల కన్వీనర్‌ దయాకర్‌రెడ్డి, నాయుడుపేటలో జడ్‌పిటిసి జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో మేనకూరు సచివాలయంలో వేడుకలు నిర్వహించారు. బిఎన్‌కండ్రిగలో వైసిపి జిల్లా సోషల్‌ మీడియా కోకన్వీనర్‌ వేలూరి రాకేష్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ సంధ్య ఆధ్వర్యంలోకేక్‌ కట్‌చేసి అన్నదానం చేశారు. బాలాయపల్లిలో పార్టీ కన్వీనర్‌ వెందోటి కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్‌ కట్‌చేశారు. రామచంద్రాపురంలో చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్‌ కట్‌ చేశారు. పుత్తూరు అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద మున్సిపల్‌ ఛైర్మన్‌ ఆనంగి హరి ఆధ్వర్యంలో 700 మందికి అన్నదానం చేశారు. ఎస్వీయూ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ బి.ఓబుల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యులు వడిత్యా శంకర్‌నాయక్‌ అలిపిరి బస్టాండ్‌ వద్ద పేదలకు అన్నదానం చేశారు. తిరుచానూరు సర్పంచి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. శ్రీకాళహస్తిలో భారీ కేక్‌ కట్‌ చేసి సిఎం జన్మదినాన్ని వేడుకగా జరిపిన ఎంఎల్‌ఎ బియ్యపు మధుసూదన్‌రెడ్డి

➡️