అభివృద్ధికి నోచని గండికోట, మైలవరం జలాశయం

మైలవరం : మైలవరం జలాశయాన్ని సిఐటియు నాయకులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కార్యదర్శి దాసరి విజరు మాట్లాడుతూ జలాశయం ప్రహరీ, విద్యుత్‌ స్తంభాలు, కట్టడాలను పరిశీలించామన్నారు. గండికోట, మైలవరం జలాశయం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏమాత్రం అభివృద్ధిపై ధ్యాస పెట్టని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మైలవరం జలాశయానికి నిధులు కేటయించాలని డిమాండ్‌ చేశారు. సందర్శకులు, పర్యాటకులు చుట్టుపక్కల ఉన్న చాలామంది ఇక్కడికి వస్తుంటారు. మత్స్యకారులు కూడా ఇదే వంతెనపై రాత్రి వేళ ప్రయాణం చేస్తుంటారని తెలిపారు. వంతెన ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదన్నారు. చాలావరకు ఇరువైపులా ప్రహరీ కుంగిపోయిందన్నారు. ఉన్నతాధికారులు వీటిపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆదాము, అబ్రహం, నరేంద్ర, రవిరావు, హుస్సేన్‌ పాల్గొన్నారు.

➡️