అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభం

Feb 1,2024 20:41

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ :మండలంలోని ములగ పంచాయతీ పరిధిలో గల డి.ములగలో గురువారం స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామం ప్రారంభంలో గల కోనేరు గట్టును అనుసరించి 150 మీటర్ల సిసి రోడ్లు, రక్షణ గోడ నిర్మాణానికి రూ.87లక్షలు ఎఐపి పంచాయతీ రాజ్‌ నిధులతో చేపట్టబోయే పనులతో పాటు కెములగ, వెలుగవలస పంచాయితీలకు చెందిన రూ.75లక్షల నిధులతో నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను స్థానిక సర్పంచులు మడక కృష్ణవేణి, దాలమ్మతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పజల చిరకాల కోరికైనన కోనేరు అభివృద్ధి, అధునాతన భవనాలను మీరు కోరుకున్న విధంగా, మీకు ఇచ్చిన మాట ప్రకారం అందజేశా మన్నారు. కార్యక్రమంలో ఎంపిపి మజ్జి శోభారాణి, జెడ్‌పిటిసి సభ్యులు బలగ రేవతమ్మ, ఎంఎంసి చైర్మన్‌ భాగ్యశ్రీ, ఎంపిడిఒ ఆకిబ్‌ జావేద్‌, కార్యదర్శి పకీరు, మండల వైసిపి అధ్యక్షులు బొమ్మి రమేష్‌, జిల్లా వైసిపి ఉపాధ్యక్షులు బి.కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి వి.గురురాజు, మండల పార్టీ సీనియర్‌ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

➡️