అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారం చేయాలి

Dec 4,2023 17:48
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల

ప్రజాశక్తి – కాకినాడ

స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని డిఆర్‌ఒ కె.శ్రీధర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయ స్పందన సమావేశ మందిరంలో జరిగిన జిల్లాస్థాయి స్పందన కార్యక్రమంలో జడ్‌పి సిఇఒ ఎ.రమణారెడ్డి, డిఎల్‌డిఒ పి.నారాయణమూర్తిలతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను సత్వరం పరిష్కారించాలని ఆదేశాలు జారీ చేశారు. వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి మొత్తం 129 అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్‌ వివిధ సెక్షన్ల అధికారులు పాల్గొన్నారు.

➡️