అర్హులైన రైతులందరికీ జలకళ

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : అర్హులైన రైతులందరికీ వైఎస్సార్‌ జళకళ పథకాన్ని అందిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ మేరకు మంజూరైన వారిలో 9 మంది రైతులకు పంపుసెట్లను స్థానిక ఎంపి డిఒ కార్యాలయంలో శుక్రవారం అందిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ వ్యవసాయానికి అండగా నిలిచేందుకు జలకళ పథకం ఎంత దోహదపడుతోందని అన్నారు. మండల పరిధిలో 160 మందికి ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు పరిపాలన అనుమతులు లభించగా 34 మందికి బోర్వెల్స్‌ చేయించామని తెలి పారు. వీరిలో 19 మంది రైతులకు విద్యుత్‌ సరఫరా కూడా ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమములో రాష్ట్ర రైతు సలహా మండలి సభ్యులు కళ్లం విజయభాస్కర్‌రెడ్డి, ఎంపిడిఒ సత్యనారాయణ, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
జలకళ బోర్లకు నెలలోగా విద్యుత్‌
ప్రజాశక్తి-అచ్చంపేట : మండల కేంద్రమైన అచ్చంపేటలోని జెడ్‌పి పాఠశాలలో నాడు-నేడు కింద చేపట్టిన పనులను పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రభుత్వ సలహాదారుడు నాగార్జునరెడ్డి శుక్రవారం పరిశీలించారు తరగతి గదుల నిర్మాణంతోపాటు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అనంతరం కలపాలం గ్రామంలో నిర్మించిన సచివాలయ భవనాన్ని, తాళ్లచెరువు, పెదపాలెం గ్రామాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో మౌలిక సదుపాయాల కల్పనను పరిశీలించారు. జలకళ ద్వారా మంజూరైన బోర్లుకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వలేదనే అంశంపై విలేకర్లు ప్రశ్నించగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనూ ఈ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, నెలరోజుల్లో పరిష్కరిస్తామని అన్నారు. రాష్ట్రంలో 14 వేల సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్టు లు ఖాళీగా ఉన్నాయని, భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని చెప్పారు. అనంతరం సర్పంచులు, వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఎంపి డిఒ శివ సుబ్రహ్మణ్యం, ఎంఇఒ శ్రీనివాసరావు, ఎంపిపి భూక్య రజినిబారు కృష్ణ నాయక్‌, వైస్‌ఎంపిపి జి.నరసిం హారెడ్డి, ఎన్‌.చంద్రబాబు, సర్పంచ్‌ వీరబాబు పాల్గొన్నారు

➡️