ఆకట్టుకున్న సంక్రాంతి సంబరాలు

సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు

ప్రజాశక్తి-మండపేట

స్థానిక సంగమేశ్వర కాలనీ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ముత్యాల మాణీక్యాంబ ఆధ్వర్యంలో ఉపాద్యాయులు చిట్టూరి వెంకట శ్రీధర్‌ పర్యవేక్షణలో జరిగిన సంక్రాంతి సంబరాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖాధికారి చింతా వెంకట సోమిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులంతా మన సంస్కతి సాంప్రదాయాలు గురించి అవగాహవ పెంచుకోవాలన్నారు. ప్రతి పండుగ ను ఈ స్కూల్లో ఉపాద్యాయులు ఎంతో అట్టహాసంగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు శేషారత్నం, రిటైర్డ్‌ రైల్వే సూపరింటెండెంట్‌ నాగభూషణం, రిటైర్డ్‌ ప్రధాన ఉపాధ్యాయులు చిట్టూరి సూర్య ప్రకాశరావు, స్వామి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

 

➡️