ఆలయ పున:నిర్మాణానికి భాగస్వాములు కావాలి

Dec 14,2023 21:52
శంకుస్థాపన కార్యక్రమంలో ఎంఎల్‌ఎ

శంకుస్థాపన కార్యక్రమంలో ఎంఎల్‌ఎ
ఆలయ పున:నిర్మాణానికి భాగస్వాములు కావాలి
ప్రజాశక్తి-అనంతసాగరం:మండలంలోని సోమశిల సోమేశ్వరాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి గురువారం పూజా కార్యక్రమాలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 900 ఏళ్ల చరిత్ర కలిగిన సోమేశ్వరాలయం ఎన్నో వరదలను చవిచూసినప్పటికి మూడేళ్ల క్రితం వచ్చిన వరదలతో ఆలయ గాలిగోపురం, అమ్మవారి దేవాలయం, నవగ్రహ మండపం కూలిపోవడంతో ఆలయ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు.ఆలయ పునర్నిర్మాణం కోసం అనేక దఫాలుగా అందరితో చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేయించిన సమయంలో వరదలతో దెబ్బతిన్న అమ్మవారి ఆలయం, గాలిగోపురం, నవగ్రహ మండపం నిర్మాణంతో పాటు ఆలయాన్ని పూర్వ వైభవంగా తెచ్చేందుకు రూ.10 కోట్లు, పర్యాటకాభివద్ధితో కలిపి మొత్తం రూ.25 కోట్ల వరకు ఖర్చు అవుతుందని వివరించారన్నారు.ఆలయ నిర్మాణాన్ని దశల వారీగా నిర్మాణాన్ని చేపట్టే విధంగా తొలుత రూ.1.50 కోట్లతో గాలి గోపురం నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్లు వివరించారు. సోమేశ్వరాలయ నిర్మాణం కోసం మ్యాచింగ్‌ గ్రాంట్‌ కింద 33 శాతం అందచేస్తే మిగిలిన నిధులు దేవాదాయశాఖ అందచేస్తుందని తెలియచేయడంతో తాము రూ.50లక్షలు అందచేశామన్నారు. దేవాదాయ శాఖ ద్వారా రూ. కోటి మంజూరు కావడం జరిగిందన్నారు. దీంతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తొలుత గాలి గోపుర నిర్మాణాన్ని దేవాదాయ శాఖ అధికారులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చూడాలని, ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు, భక్తుల కోరిక మేరకు నిర్మాణం వేగవంతం చేసేలా చూడాలని దేవాదాయశాఖ అధికారులను కోరారు. అంతేకాక ఆలయ నిర్మాణంలో భాగంగా అమ్మవారి ఆలయ నిర్మాణానికి సహకారం అందిస్తున్న జెడ్‌పిటిసి సభ్యులు రాపూరు వెంకటసుబ్బారెడ్డి, ప్రముఖ కాంట్రాక్టర్‌ ఊరిబిండి ప్రభాకర్‌ రెడ్డిలకు అభినందనలు తెలియచేస్తున్నాని తెలిపారు. ఆధ్యాత్మికత విరజిల్లే విధంగా అందరి సహకారంతో ఆలయ నిర్మాణం సాగుతుందన్నారు. పర్యాటక ప్రాంతాభివద్ది కోసం పలువురితో చర్చించి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి దష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. సుమారు రూ.15 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి అందచేయడం జరిగిందని వివరించారు. సోమశిల జలాశయానికి వచ్చే పర్యాటకులకు, ఆలయానికి వచ్చే భక్తుల కోసం రూంలు, ఇతర మౌలిక వసతులు కల్పించి అభివద్ది చేసేలా చూస్తామని వివరించారు.కార్యక్రమంలో సర్పంచ్‌ ఉప్పు విజరు కుమార్‌, నాయకులు, కార్యకర్తలు, ఆలయ ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

➡️