ఆశాల సమ్మెకు పలువురి మద్దతు

Nov 30,2023 23:03 #ఆశాల సమ్మె
ఆశాల సమ్మె

ప్రజాశక్తి-దేవరపల్లిరమాదేవి కుటుంబానికి న్యాయం చేయాలని ఆశ వర్కర్లు చేపట్టిన సమ్మెకు గురువారం పలు ప్రజా సంఘాలు, జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. పది రోజుల నుంచి ఆశ వర్కర్ల ఆందోళన చేస్తుంటే అధికార పార్టీ ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు పట్టించుకోకపోవడం చాలా దారుణం అన్నారు. పౌర హక్కుల సంఘం నాయకులు ఎన్‌.శ్రీమన్నారాయణ, జనసేన పార్టీ నాయకులు డి.సువర్ణ రాజు, ఐఎఫ్‌టియు రాష్ట్ర కోశాధికారి కెవి.రమణ, సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.సుందర బాబులు మాట్లాడారు. ఆశ వర్కర్ల పట్ల ప్రభుత్వ వైఖరి చాలా దుర్మార్గమన్నారు. రమాదేవి కుటుంబానికి న్యాయం చేయకుండా ఆ ఉద్యోగాన్ని వేరే ఒకరికి కేటాయించడం, పది రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం తగదన్నారు. రమాదేవి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఆశా వర్కర్లు చేస్తున్న పోరాటానికి తాము అండగా ఉంటామని అన్నారు. అనంతరం దేవరపల్లి బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లిక, మహర్షి, కెవి.రమణ, గ్రీష్మన్‌ కుమార్‌, పి.నాగేశ్వరరావు, మల్లి బాబు, భగత్‌, రత్నాజీ అచ్చమ్మ, జాజిమొగ్గల శ్రీనివాస్‌, చప్పటి శివ, కె.సత్తిబాబు, సుందర్‌ సింగ్‌, అంజిబాబు పాల్గొన్నారు.

➡️