ఇంటింటా ‘ఇంటూరి’ ప్రచారం

Jan 11,2024 20:00
ఇంటింటా 'ఇంటూరి' ప్రచారం

ఇంటింటా ‘ఇంటూరి’ ప్రచారం
ప్రజాశక్తి-కందుకూరు
కందుకూరు పట్టణంలో బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి అనూహ్య స్పందన లబిస్తుంది. ప్రతి వార్డులో టిడిపి కందుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావుకి స్వాగతం పలుకుతున్నారు. టిడిపి నేతలను ఇళ్లలోకి ఆహ్వానించి మద్దతు తెలుపుతూ సమస్యలు వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సైకోచేష్టలు, చేతగాని పరిపాలన – రాష్ట్రంలో వైసిపి నేతల విచ్చలవిడి దోపిడీలు, దందాలను ప్రజలకు నాగేశ్వరరావు వివరిస్తున్నారు. బుధవారం పట్ట ణంలోని 27, 28 వ వార్డుల పరిధిలోని యాదవపాలెం, రజకపాలెం ప్రాంతాల్లో ప్రచారం ఇంటూరి ప్రచారం చేశారు. పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, 27వ వార్డు అధ్యక్షుడు పాకల మాల్యాద్రి, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు సవిడి బోయిన వెంకటకష్ణ, వార్డు నాయకులు బక్కమంతల మనోజ్‌, హరీష్‌, మమత, వెంకటరత్నం, పామర్తి సాయి, అమ్మన బోయిన వేణు, మహేష్‌, గోకరాజు అంకమ్మ, మేడా నరసింగరావు, పెరుగు వెంక టేశ్వర్లు, శంకర యాదవ్‌, కొత్తకోట మహేష్‌, మాల్యాద్రి, కొచ్చర్ల వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు చిలక పాటి మధు, షేక్‌ రఫీ, పొడపాటి మహేష్‌, షేక్‌ మున్నా, చుండూరి శ్రీను, షేక్‌ సలాం, ముచ్చు వేణు, పులి నాగరాజు, జియావుద్దీన్‌, షేక్‌ ఫిరోజ్‌, మమ్ముషా, అత్తంటి శివకష్ణ, గుమ్మా శివ, మచ్చ మనోహర్‌ ఉన్నారు.

➡️