ఈవీఎంల పని తీరుపై అవగాహన

Feb 24,2024 22:08

ఈవీఎంల పని తీరుపై అవగాహన
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

అసెంబ్లీ, పార్లమెంటు, సెగ్మెంట్ల వారీగా ఈవీఎంలను కేటాయించుటకు జాతీయ, రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో ట్రెయిల్‌ ఈవీఎంల మొదటి రాండమైజేషన్‌పై అవగాహన నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ సగిలి షన్మోహన్‌ పేర్కొన్నారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్‌ సమావేశంలో డిఆర్‌ఓ బి.పుల్లయ్యతో కలసి గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులకు రాండమైజేషన్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంటు, సెగ్మెంట్ల వారీగా ఈవీఎంలను కేటాయించుటకు జాతీయ, రాష్ట్రంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో ట్రెయిల్‌ ఈవీఎంల మొదటి రాండమైజేషన్‌పై నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఏడు నియోజకవర్గాలు, పార్లమెంట్‌ నియోజకవర్గంకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి లాగ్‌ఇన్‌లో రాండమైజేషన్‌ తర్వాత రాజకీయ పార్టీల నాయకులు అంగీకారం తెలియజేయడంతో మళ్ళీ నియోజకవర్గాల వారీగా ఆర్‌ఓ లాగ్‌ఇన్‌కు వెళ్లడం జరుగుతుందని మళ్ళీ ఆర్‌ఓలు నియోజకవర్గంలో రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో రాండమైజేషన్‌ నిర్వహించిన తర్వాత పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించబడుతాని తెలిపారు. మొదటి యాదచ్చిక ఈవీఎంల జాబితా నియోజకవర్గాల వారీగా జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో భాగస్వామ్యం చేయబడుతుందని అన్నారు. ఒక నియోజకవర్గంకు రాండమైజేషన్‌ చేయవచ్చు అని, అన్ని నియోజకవర్గాలకు కూడా ఒకేసారిగా రాండమైజేషన్‌ చేయవచ్చునని తెలిపారు. రాండమైజేషన్‌ రాజకీయ పార్టీల నాయకులు అంగీకరించిన తర్వాత రాండమైజేషన్‌ అయిన కాపీలను అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలకు, పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి జిల్లాకు 4708 బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రో యూనిట్లు 4226, వివిప్యాడ్లు 5082 రావడం జరిగిందని తెలిపారు. సాయంత్రం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశం హల్‌లో రాండమైజేషన్‌పై డిప్యూటీ తహశీల్దార్లకు, ఈడియంలు ఎలక్షన్‌ డిటిలు, కంప్యూటర్‌ ఆపరేటర్లుకు ఈవీఎంలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు వెంకట శివ, భవాని, రాజకీయ నాయకులు బిజెపి నుంచి అట్లూరి శ్రీనివాసులు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి భాస్కర్‌, పరదేశి, సిపిఎం నుంచి వాడ గంగరాజు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి ఉదయ కుమార్‌, టిడిపి ప్రభుతేజ్‌, బిఎస్పీ నుంచి భాస్కర్‌, ఎలక్షన్స్‌ విభాగం సిబ్బంది ఉమాపతి, మనోజ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️