ఉత్తమ రైతులకు సన్మానం

Dec 23,2023 16:25 #tirupathi
  • జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

ప్రజాశక్తి-పుత్తూరు టౌన్‌(తిరుపతి) : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. మన దేశంలో ప్రస్తుతం వ్యవసాయం సంక్షోభంలో ఉందని, ప్రకృతి వైపరీత్యాలు, నకిలీ విత్తనాలు, సరైన మార్కెటింగ్‌ సదుపాయాలు లేక పోవడం మొదలైన వాటివల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని..ఇది చాలా దురదష్టమని తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి వ్యవసాయ.విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్‌ కార్తిక్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కంటే ఇప్పుడు భారతీయ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతోందని, వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం మరింతగా మెరుగు పర్చాల్సిన అవసరం ఉందన్నారు. సత్యవేడు వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుబ్రమణ్య ముఖ్య అతిధిగా.విచ్చేసి ప్రసంగిస్తూ ప్రపంచంలోనే అధిక జనాభా గల భారత్‌లో వ్యవసాయ అభివృద్ధి కుంటు పడితే దేశాభివృద్ధి కూడా కుంటు పడుతుందన్నారు. యాంత్రికత వల్ల కూలీలు సమస్యను అధిగమించవచ్చని అన్నారు. అనంతరం ఎంపిక చేసిన ఆరుగురు ఉత్తమ రైతులకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో విభాగ అధ్యక్షులు టి.నరసింహులు, వరలక్ష్మి, బాబురావు, వి.వీరయ్య, ఆర్‌.వివాణిశ్రీ, పి.హరిబాబు, ఏ.నాగేశ్వరరావు, పి.సుజన, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

➡️