ఉత్సాహంగా ‘ఆడుదాం ఆంధ్ర’

Jan 24,2024 21:31

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌: నియోజకవర్గ స్థాయి ఆడదాం ఆంధ్ర పోటీలను నగర మేయర్‌ విజయలక్ష్మి, ఎంపిపి మామిడి అప్పలనాయుడు ప్రారంభించారు. బుధవారం రాజీవ్‌ క్రీడా మైదానంలో ఐదు క్రీడాంశాలలో నిర్వహించిన పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో సాగాయి. కార్యక్రమంలో సహాయ కమిషనర్‌ ప్రసాదరావు పాల్గొన్నారు.నెల్లిమర్ల: నగర పంచాయతీలో ఆడుదాం ఆంధ్ర నియోజక వర్గ స్థాయి పోటీలు బుధవారం స్థానిక థామస్‌ పేట ఫుట్‌ బాల్‌ గ్రౌండ్‌లో నిర్వహించారు. అగురు వీధి సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ బంగారు సరోజినీ, వైస్‌ చైర్మెన్లు సముద్రపు రామారావు, కారుకొండ వెంకట కృష్ణారావు, నగర పంచాయతీ కో ఆప్షన్‌ సభ్యులు చిక్కాల సాంబశివరావు, కమిషనరు పి. బాలాజీ ప్రసాద్‌, ఎంపిడిఒ జి.రామారావు, ఇఒపిఆర్‌డి కె.సింహాద్రి, వైద్య బృందం, పీడీలు, పిఇటిలు, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.చీపురుపల్లి: మండల స్థాయిలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్రా క్రీడలను ఎంపిపి ఇప్పిలి వెంకటనర్శమ్మ, జెడ్‌పిటిసి వలిరెడ్డి శిరీష లు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ మంగళగిరి సుధారాణి, వైసిపి మండల అధ్యక్షుడు ఇప్పిలి అనంతం, జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, జిల్లా యువజన నాయకులు బెల్లాన వంశీకృష్ణ, చీపురుపల్లి పట్టణ అధ్యక్షుడు పతివాడ రాజారావు, స్కూల్‌ ఛైర్మన్‌ కరణపు ఆదినారాయణ, ఎంపిటిసిలు, నాయకులు, పాల్గొన్నారు.శృంగవరపుకోట: గురువారం నుంచి ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు మండల క్రీడా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పొట్నూరు శ్రీరాములు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ పోటీలు ఎంపిడిఒ శేషుబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. మగవారికి పోటీలను డాక్టర్‌ వరలక్ష్మి కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీ, తెన్ను బొడ్డవర క్రీడా మైదానంలో ప్రారంభమవుతాయని, క్రికెట్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 27న మహిళలకు కబడ్డీ, కోకో, వాలీబాల్‌ పోటీలను డాక్టర్‌ వరలక్ష్మి కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ క్రీడామైదానంలో గవర్నమెంట్‌ బాలుర ఉన్నత పాఠశాలలో బ్యాడ్మింటన్‌ మహిళలకు ఉంటుందని అందుకు సిద్ధం చేసినట్లు శ్రీరాములు తెలిపారు.

➡️