ఉత్సాహంగా బాలోత్సవం

ప్రజాశక్తి – కడప ప్రతినిధి మితిమీరిన టెక్నాలజీ వినియోగం ద్వారా పిల్లల్లో మానసిక ఎదుగుదల లోపిస్తోందని, తద్వారా సరైన నిద్ర, పౌష్టికాహారం లోపి ంచడం కారణంగా శారీరక దృఢత్వాల్ని కోల్పోతున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం కడప నగరంలోని మరియాపురం సెయింట్‌జోసెఫ్‌ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో డాక్టర్‌ సి.ఓబుల్‌రెడ్డి అధ్యక్షతన వేమన ప్రాంగణంలో నిర్వహించిన కడప బాలోత్సవ సంబరాలు ముగిశాయి. ఈ సందర్భంగా టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌.శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజం టెక్నాలజీమయంగా మా రిందన్నారు. ఐదేళ్లలోపు పిల్లలను సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలని తెలిపారు. అల్లరి చేస్తున్నారనే నెపంతో తల్లిదండ్రులు సెల్‌పోన్స్‌ చేతికి అందించడం అనర్థాలకు దారితీస్తున్నట్లు అధ్యయనాలు వెల్ల డిస్తున్నాయన్నారు. క్రీడల్లో నైపుణ్యం కలిగిన క్రీడా కారులకు మిలిటరీ, నేవీ, బ్యాంకుల ఉద్యోగాలు లభించిన సంగతిని గమనంలో ఉంచుకో వాల న్నారు. నిర్వాహక కమిటీ సభ్యులు డాక్టర్‌ సి.ఓబు ల్‌రెడ్డి, లకీëరాజ మాట్లాడుతూ తల్లిదండ్రులు మార్కుల మాయాజాలంలో పడరాదని హెచ్చరి ంచారు. బాలోత్స వాలను 42 ఈవెంట్లను మూడు వేదికల్లో నిర్వహించామని తెలిపారు. బాలోత్స వాలకు హాజరైన పిల్లలను వేషధారణల్ని గమనిస్తే మినీ భారత దేశాన్ని చూసినట్లు ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఎస్‌వి ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ వీరసుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ బాలో త్సవాల్లో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తో ందన్నారు. సెయింట్‌ జోసెఫ్‌ కళాశాల కరెస్పాండెంట్‌ సుధాకర్‌, విద్యావేత్త బీరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులు పిల్లలకు నైతిక విలువల్ని నేర్పించాలన్నారు. క్రమశిక్షణ, నైతిక విలువల కారణంగా పిల్లలు ఉన్నతస్థానాలకు ఎదుగుతారని చెప్పారు. ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు రాజా వెంగల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచం యుద్ధాల కారణంగా బాలల భవిష్యత్‌ అంథ కారమయంగా మారుతోందన్నారు. వైవీయూ ప్రిన్సిపల్‌ రఘు నాథరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఎక్కడ చూసినా డాక్టర్స్‌, ఇంజినీరింగ్‌ కోర్సుల జపం చేస్తుండడం ఆందోళన కలిగి స్తోందన్నారు. ఎస్‌ఎస్‌ఎ ప్రాజెక్టు ఆఫీసర్‌ డాక్టర్‌ ఎ.ప్రభాకర్‌రెడ్డి బాలోత్సవాల్లోని మూడు వేదికల దగ్గర ఏర్పాటు చేసిన కృత్యాలను పరిశీలిం చారు. కెఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్‌ కళాశా లకు చెందిన 15 మంది వాలంటీర్లకు సన్మానించి, జ్ఞాపి కను అందజేశారు. బాలోత్సవ కమిటీ ట్రెజరర్‌ సునీత 42 ఈవెంట్లలో మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్న జూనియర్‌, సీనియర్స్‌ విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యా ర్థులకు బహుమతులు ప్రకటించారు. వేంపల్లి ఛైతన్య స్కూల్‌కు చెందిన పల్లవి, శ్యామల స్కూల్‌కు చెందిన సంతోష్‌, బాలవికాస్‌ స్కూల్‌కు చెందిన హేమ సాయిశ్రీ, విద్యామందిర్‌ తదితర పలు పాఠశా లలకు చెందిన విద్యార్థులకు యోగివేమన యూని వర్శిటీ ప్రిన్సిపల్‌, ఎస్‌వి ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ప్రిన్సిపల్‌ వీరసుదర్శన్‌రెడ్డి, భారతీ సిమెంట్‌ ప్రతినిధి భాస్కర్‌రెడ్డి, బీరం సుబ్బారెడ్డి తదితర ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. బాలోత్సవాల ముగింపు కార్యక్ర మంలో పరిశ్ర మలశాఖ రిటైర్డు ఆఫీసర్‌ గోపాల్‌, రిటైర్డు డిప్యూటీ జిల్లా విద్యాశాఖా ధికారి నాగము నిరెడ్డి, భారతీ సిమెంట్‌ ప్రతినిధి భాస్కర్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, బాలయల్లారెడ్డి, సత్తార్‌ఫైజీ, డాక్టర్‌ సురేష్‌రెడ్డి, ఉపా ధ్యాయులు వనజారెడ్డి, మహేష్‌, విజయకుమార్‌, శివరాం వేలాది మంది పిల్లలు పాల్గొన్నారు.

➡️