ఉపాధి శిక్షణ శాఖ వెబ్‌పోర్టల్‌ ప్రారంభం

వెబ్‌ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభిస్తున్న కలెక్టర్‌

గుంటూరు: ఉపాధి, శిక్షణశాఖ నూతనంగా రూపొందించిన ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ వెబ్‌పోర్టల్‌ను జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి శుక్రవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యువతకు ఉద్యోగావకాశాలు పెంచే దిశగా ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాల సమాచారం తెలుసుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ వెబ్‌ పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చిందన్నారు. నిరుద్యోగ అభ్యర్థులకు ఆన్లైన్లో సేవలు, ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌, అదనపు అర్హతలు నమోదు సులభతరం చేసే విధంగా ఉపాధి మరియు శిక్షణ శాఖ వెబ్సైట్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చిందన్నారు. జిల్లా ఉపాధి కార్యాలయం, మోడల్‌ కెరీర్‌ సెంటర్లు, ఇంటర్నెట్‌ సెంటర్లు మొబైల్‌ ద్వారా కూడా అభ్యర్థులు తాము ఉన్న చోట నుంచే ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ సులభంగా పొందవచ్చుని జిల్లా కలెక్టర్‌ ఎం వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. జిల్లా ఉపాధి అధికారి కె.రఘు మాట్లాడుతూ ఇంజి నీరింగ్‌, ఎంబీఏ, డిగ్రీ కోర్సులు సహా ఐటీ, టెక్నికల్‌ రం గాలకు యువత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో వారి అవసరాలకు పెద్దపీట వేస్తూ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ వెబ్‌ పోర్టల్‌ను ప్రభుత్వం రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగమేదైనా దానికి సంబంధించిన సమాచారం అధికారికంగా తెలుసుకుని, దరఖాస్తు చేసుకునేందుకు అనువుగా ఈ పోర్టల్‌ను తీర్చిదిద్దినట్లు చెప్పారు. వఎజూశ్రీశీyఎవఅ్‌. aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో ఆధార్‌ ఫోన్‌ నంబర్‌ ద్వారా లాగిన్‌ అయి విద్యార్హతల వివరాలను పోర్టల్‌లో నమోదు చేయగానే మొబైల్‌కు సంక్షిప్త సందేశం వస్తుందని, అభ్యర్థుల వివరాలు జిల్లాస్థాయి అధికారికి చేరి, వారి ఆమోదంతో ఎంప్లాయ్మెంట్‌ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ తెలియజేస్తారన్నారు. రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌, అదనపు అర్హతలు నమోదు సులభంగా పోర్టల్‌ ద్వారా చేసుకోవచ్చన్నారు. గతంలో జిల్లా ఉపాధి కార్యాలయంలో ఎంప్లాయి మెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉన్న అభ్యర్థులు పాత ఎంప్లాయి మెంట్‌ కార్డు నంబరుతో వివరాలను సరి చూసుకుని కొత్త ఎంప్లాయి మెంట్‌ కార్డును పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జూనియర్‌ ఎంప్లాయిమెంట్‌ అధికారి కె. రమాదేవి, జూనియర్‌ అసిస్టెంట్‌ కె.శ్రీనివాసశర్మ, యంగ్‌ ప్రోఫిషనల్‌ మల్లీశ్వరి పాల్గొన్నారు.

➡️