ఉపాధ్యాయులపై ఒత్తిడి : యుటిఎఫ్‌

Dec 1,2023 22:48 #utf
ఫొటో : మాట్లాడుతున్న యుటిఎఫ్‌ నాయకులు

ఫొటో : మాట్లాడుతున్న యుటిఎఫ్‌ నాయకులు
ఉపాధ్యాయులపై ఒత్తిడి : యుటిఎఫ్‌
ప్రజాశక్తి – సీతారామపురం : రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులపై ఒత్తిడి ఎక్కువ అవుతుందని వారిపై ఒత్తిడి తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యుటిఎఫ్‌ నాయకులు కోరారు. ఈ మేరకు మండల యుటిఎఫ్‌ నూతన కౌన్సిల్‌ సమావేశం సీతారామపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల నూతన కార్యవర్గం ఎన్నికైంది. మండల యుటిఎఫ్‌ శాఖ గౌరవ అధ్యక్షులుగా గాజుల రంతూజానీ, అధ్యక్షులుగా భోగ్యం శ్రీనివాసులు, సహాయ అధ్యక్షులుగా పేరాల శ్రీనివాసులు, పిఎపి కుమారి, ప్రధాన కార్యదర్శిగా గొడ్లవీటి వెంకటేశ్వర్లు, కోశాధికారిగా ఓంకారం నరసింహారాజు, జిల్లా కౌన్సిలర్‌గా వెంకటేశ్వర్‌ రెడ్డి, అన్నంగి ప్రసాద్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి బాల రంగయ్య వ్యవహరించారు. ఈ సందర్భంగా బాల రంగయ్య మాట్లాడుతూ పిఆర్‌సి, డిఎ అరియర్స్‌, పిఎఫ్‌ లోన్‌, ఎపిజిఎల్‌ఐ లోన్‌, అరియర్స్‌ వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మెగా డిఎస్‌సిని నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. పిఆర్‌సిని ప్రకటించడం ఆలస్యమైన కారణంగా 20శాతం ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులపై ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎడమ తిరుపతయ్య, రాష్ట్ర కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, పిసిఎం కొండయ్య, ఆనందీశ్వరయ్య, మహేష్‌, సురేష్‌, కుటుంబ సంక్షేమ కార్యదర్శి నాయక్‌, బాలిరెడ్డి, బాల గురవయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️