ఎంఎల్‌సి సాబ్జీ మృతికి ఘన నివాళులు

Dec 15,2023 22:34 #MLC
ఫొటో : ఎంఎల్‌సి సాబ్జీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న అంగన్‌వాడీలు, ప్రజాసంఘాల నాయకులు

ఫొటో : ఎంఎల్‌సి సాబ్జీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న అంగన్‌వాడీలు, ప్రజాసంఘాల నాయకులు
ఎంఎల్‌సి సాబ్జీ మృతికి ఘన నివాళులు
ప్రజాశక్తి-మర్రిపాడు : తూర్పుగోదావరి జిల్లా ఆకువీడు సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పిడిఎఫ్‌ ఎంఎల్‌సి షేక్‌.సాబ్జీ మృతికి ప్రజాసంఘాల నాయకులు సంతాపం ప్రకటిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి రహంతులా,్ల సిఐటియు మండల కార్యదర్శి రత్నయ్య మాట్లాడుతూ ఆయన యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించి, ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ 5యేళ్లు సర్వీసు ఉండగానే స్వచ్ఛంద పదవి విరమణ చేసి 2019లో సిపిఎస్‌ రద్దు చేయాలని ఏలూరు నుండి విజయవాడ వరకు నిర్వహించిన పాదయాత్రకు నాయకత్వం వహించారని తెలిపారు. 2021లో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారన్నారు. ఆయన మృతికి ఘన నివాళులర్పించారు. ఆత్మకూరు సిఐటియు కార్యదర్శి శివ, సిఐటియు మండల అధ్యక్షులు శ్రీనివాసులు, ఐద్వా మండల అధ్యక్ష కార్యదర్శులు శ్యామలమ్మ, అంగన్‌వాడీ వర్కర్‌ హెల్పర్‌ యూనియన్‌ నాయకురాలు లక్ష్మి, మిడ్డే మీల్స్‌ మండల కార్యదర్శి రాములమ్మ, ఆశా వర్కర్‌ కామాక్షమ్మ పాల్గొన్నారు.

➡️