ఎమ్మెల్సీ సాబ్జీ మతి తీరని లోటు

పోరుమామిళ్ల : ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి మతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి చెన్నయ్య, ఎస్‌టియు జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ఎపిటిఎఫ్‌ అధ్యక్షులు సత్తార్‌ పేర్కొ న్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని ఎంఆర్‌సి భవనం వద్ద చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగ న్వాడీ కార్యకర్తల ధర్నాకు మద్దతు తెలియజేసి తిరిగి వెళ్లే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై మతి చెందడం అందరిని కలచివేసిందన్నారు. సాధారణ ఉపాధ్యాయ వత్తి నుంచి ఉపాధ్యాయ నేతగా అంచలంచెలుగా ఎదిగి ఉపాధ్యాయ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు రమణమూర్తి, కె. జోజయ్య, భాస్కర్‌ రెడ్డి, ఈశ్వరరావు, ఎస్‌టియు నాయకులు పుల్లయ్య, బాలరాజు, జయరామిరెడ్డి, ఎపిటిఎఫ్‌ నాయకులు రాంభూపాల్‌ రెడ్డి, ఆదిశేషారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️