ఎస్‌పి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

Jan 1,2024 19:32

 ప్రజాశక్తి-విజయనగరం :   జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఎస్‌ఇబి అదనపు ఎస్‌పి ఎస్‌.వెంకటరావు, ఎఆర్‌ అదనపు ఎస్‌పి ఎంఎం సోల్మన్‌, విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం ట్రాఫిక్‌, డిటిసి, ఎఆర్‌ డిఎస్‌పిలు ఆర్‌.గోవిందరావు, పి.శ్రీధర్‌, ఎ.ఎస్‌.చక్రవర్తి, డి.విశ్వనాధ్‌, వీరకుమార్‌, యూనివర్స్‌, పలువురు సిఐలు, ఎస్‌ఐలు, పలువురు పట్టణ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఎస్‌పిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, పోలీసుశాఖ నిర్ధేశించుకున్న లక్ష్యాలుకు చేరుకొనే విధంగా సమర్ధవంతంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, పోలీసుశాఖ ప్రతిష్టను పెంచే విధంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

➡️