ఎస్మా ఉన్నా పోరాటం ఆగదు…

ఎస్మా ఉన్నా పోరాటం ఆగదు..

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధితమను బెదిరిస్తూ ఎస్మాను ప్రయోగించినా సర్కారు బెదిరింపులకు భయపడేది లేదని, సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని అంగన్‌వాడీలు ముక్తకంఠంతో స్పష్టం చేస్తున్నారు. స్కీమ్‌ వర్కర్లుగా పని చేస్తున్న అంగన్‌వాడీలకు జిఒ నెంబరు 2 ద్వారా ఎస్మా వర్తించదని చెబుతున్నారు. చాకిరీ బారెడు వేతనం మూరెడు అన్న చందాన ఉంది అంగన్‌వాడీల పరిస్థితి. ఐసిడిఎస్‌ పరిరక్షణకు, మాతా శిశు మరణాలను తగ్గించేందుకు, ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూసేందుకు, 6 రకాల జబ్బులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించేందుకు పౌష్టికాహార లోపాన్ని నివారించే విధులను అంగన్‌ వాడీలు నిర్వర్తి స్తున్నారు. వీటితో పాటు జాబ్‌ చార్టులో లేని అనేక సేవలను నిర్వహిస్తూ తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొం టున్నారు. వీరికి కనీస వేతనాలను అందిం చడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శి స్తోంది. ఉద్యోగ భద్రత లేని అంగన్‌ వాడీల సమ స్యలపై ప్రభు త్వం పట్ట నట్లు వ్యవ హరిస్తుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రమోషన్స్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ 26 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. ప్రభుత్వం తాము కోరిన విధంగా సమస్యలను పరిష్కరిస్తే వెంటనే సమ్మె విరమించి విధులకు హాజరవుతామని స్పష్టం చేస్తున్నారు.ఎస్మా ప్రయోగం సరికాదురాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకుండా బెదిరింపు ధోరణితో ఎస్మాను ప్రయోగించడం సరికాదని సిపిఎం కాకినాడ జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టేకుమూడి ఈశ్వరరావు, కెఎస్‌.శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో ఖండించారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీను అమలు చేయాలని 26 రోజులుగా అంగన్వాడీలు ఆందోళన చేస్తుంటే స్పందించకుండా రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. పనికి తగ్గ వేతనం చెల్లించకుండా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరు సరికాదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు.

➡️