ఒంటికాలిపై నిల్చుని అంగన్వాడీల నిరసన

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వైఎస్‌ఆర్‌ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి 24వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. భిక్షాటన చేస్తూ, ఒంటి కాలిపై నిల్చుని, ప్రభుత్వ బెదిరింపు జిఒ ప్రతులను దహనం చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీలు మాత్రం సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ప్రజాశక్తి-కడప అర్బన్‌ వేతనాలు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రాట్యుటీ చెల్లించాలన్న ప్రధాన డిమాండ్లతో నిర్వహిస్తున్న సమ్మె గురువారం నాటికి 24వ రోజుకు చేరుకుంది. అర్బన్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట ఒంటి కాలిపై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి పి.వెంకట సుబ్బయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వి.అన్వేష్‌, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి.ఎం.ఓబులేసు మాట్లాడుతూ అంగన్వాడీలు 24 రోజులుగా రోడ్డున పడి సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోగా అంగన్వాడీలపై అబద్ధాలను ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికే సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదని చెప్పారు. అంగన్వాడీల సమస్యలు అన్నీ పరిష్కరించాం, విధులలో చేరాలని ఒక అధికారి అంటున్నారని, ఇది ప్రజలలో అంగన్వాడీలపై వ్యతిరేక భావనను ప్రచారం చేయడంలో భాగమన్నారు. ప్రధాన డిమాండ్లపై తేల్చకుండా చివరి ఒకటి,రెండు డిమాండ్లను పరిష్కరించినంత మాత్రాన సమ్మె ఎలా ఆగుతుందని ప్రశ్నించారు. మరోవైపు పలానా సమయంలోగా ఉద్యోగాలలో చేరకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు అంజనీ దేవి, దీప, వినిలా, వసుంధర పాల్గొన్నారు. పులివెందుల టౌన్‌ : జీతాలు పెంచాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని వేడుకుంటున్నామని అంగన్వాడీలు దండాలు పెడుతూ నిరసన తెలియజేశారు. తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. చాపాడు : తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు ఎపిటిఎఫ్‌ రాష్ట ఉపాధ్యక్షులు ఎ.శ్యాంసుందర్‌రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యో వరకు సమ్మెను కొనసాగించాలన్నారు. ఖాజీపేట :అంగన్వాడీలు పద్మావతి, దేవి, సునీత, ఆశ వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీలు, ఆయాలు పాల్గొన్నారు. పోరుమామిళ్ల : తహశీల్దార్‌ కార్యాలయంలో అంగన్వాడీలు అంబేద్కర్‌ విగ్రహం ఎదురుగా ఆటో లాగుతూ జీతాలు పెంచాలని నిరసన తెలిపారు. కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌.భైరవప్రసాద్‌, జిల్లా కమిటి సభ్యులు ఓబులాపురం విజయమ్మ, పోరుమామిళ్ల ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు మేరి, వినోదా, దస్తగిరిమ్మ, జ్యోతిమ్మ, అంజన్నమ్మ, లీలావతి, రమాదేవి, శ్రీదేవి అంగన్వాడీలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) : తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు సమ్మెను కొనసాగించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు మంజుల, సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, సిఐటియు కార్యదర్శి విజరు కుమార్‌, అంగన్వాడీ కార్యదర్శి సుబ్బలక్ష్మి, విజయ అంగన్వాడీలు పాల్గొన్నారు. బద్వేలు : అంగన్వాడీలు ప్రభుత్వ బెరింపు ప్రతులను దహనం చేస్తూ నిరసన తెలియజేశారు. సమ్మెకు విద్యుత్‌, ఐద్వా, డివైఎఫ్‌ఐ సంఘాలు మద్దతు తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు, పట్టణ కో-కన్వీనర్లు పిసి.కొండయ్య, రాజగోపాల్‌, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు చిన్ని, నాయకులు అదిల్‌, ఇమ్మనియల్‌, ఐద్వా మహిళా సంఘం నాయకులు నాగమ్మ, అంగన్వాడీ ప్రాజెక్ట్‌ నాయకులు సుభాషిని, ఉషానమ్మ, కళావతి, తులసమ్మ, విజయమ్మ, శోభా దేవి, సుభద్ర, జయప్రదమ్మ, రాధమ్మ రత్నమ్మ కె.వి సుభాషిని ,వాణి వసంత సరోజనమ్మ వందలాదిమంది అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️