ఓటింగ్‌పై అవగాహన

ఓటింగ్‌పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు

ప్రజాశక్తి-చోడవరం :

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్‌విఈఈపి, వెలుగు డిపార్టుమెంట్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఓటింగ్‌ నమోదు, ఎన్నికల ప్రక్రియపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.రాధాకృష్ణ, డిఆర్‌డిఎ పీడీ శచీదేవి, ఏరియా కోఆర్డినేటర్‌ రత్నప్రభ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులను ఎనిమిది టీములుగా విభజించి ఓటింగ్‌, ఎలక్షన్‌ ప్రక్రియపై క్విజ్‌, స్లొగన్స్‌, డిబేట్‌ వంటి పోటీలు నిర్వహించారు. క్విజ్లో సంతోషి టీమ్‌, స్లొగన్స్‌లో ఎస్‌ ప్రవళిక, డిబేట్‌లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ పీవోలు డి మాల్యాద్రి, డాక్టర్‌ రత్నభారతి, సీనియర్‌ అధ్యాపకులు ఎస్‌ఎం రఫుద్దీన్‌, హెచ్‌ సుధీర్‌, డాక్టర్‌ ఏ కృష్ణారావు పాల్గొన్నారు.

➡️