ఓటును వినియోగించుకోవాలి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ప్రజలు ఓటును వినియోగించుకోవాలని వక్తలు పిలుపు నిచ్చారు. ఆదివారం బ్లడ్‌ 2 లివ్‌ వ్యవస్థాపకులు పట్టుపోగుల పవన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఐఎంఎ హాలులో ‘నా ఓటు – నా హక్కు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఓటుకు నోటు తీసుకోకుండా నాయకున్ని ఎన్నుకోవాలని కోరారు. సమాజాన్ని బాగు చేసే ప్రయత్నంలో ఒక అడుగు ముందుకు వేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో యోగా గురువు సిద్దయ్య, సైకాలజిస్ట్‌ సునీత, డాక్టర్‌ రంగనాధ్‌రెడ్డి, ఖాజీ ఖదీర్‌, తాజుద్దీన్‌, రమేష్‌, మద్దిలేటి, మల్లికార్జున, నిత్య, సుధాకర్‌, శివశంకర్‌రెడ్డి, కృష్ణతేజ, రవితేజ యాదవ్‌, హర్షద్‌, గణేష్‌, రామాంజనేయులు, రామాంజనేయరెడ్డి, పలువురు వక్తలు పాల్గొన్నారు.

➡️